జయప్రదను రాజకీయాల్లోకి తెచ్చిన అమర్ సింగ్ కన్నుమూత  - MicTv.in - Telugu News
mictv telugu

జయప్రదను రాజకీయాల్లోకి తెచ్చిన అమర్ సింగ్ కన్నుమూత 

August 1, 2020

Rajya Sabha Member Amar Singh Jayaprada

రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్‌ కన్నుమూశారు. కిడ్నీ సంబంధ అనారోగ్యంతో ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందతున్న ఆయన ఈ రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 64 ఏళ్ల అమర్ సింగ్ కు భార్య పంకజ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నటి జయపద్రను రాజకీయాల్లోకి తీసుకురావడంతోపాటు యూపీ రాజకీయాల్లో ఒకప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉన్న అమర్ 2013 నుంచి మూత్రపిండాల వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఏడు నెలల పాటు సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందరు. తర్వాత ముంబైలో చేరారు. 1956లో యూపీలోని అజమ్‌ఘర్‌లో జన్మించిన అమర్‌సింగ్‌ తొలిసారి 1996లో రాజ్యసభకు ఎన్నికైయ్యారు. 2016లో సమాజ్ వాదీ పార్టీ  మద్దతుతో ‘స్వతంత్ర’ అభ్యర్థిగా చివరిసారి ఎన్నికయ్యారు. అయ్యారు. ఆయన మొత్తం నాలుగు పర్యాయాలు ఎంపీగా ఉన్నారు. 

రాజకీయ ప్రస్థానం..

అమర్ ఎస్పీ యూపీ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేశాడు. ములాయం సింగ్‌కు ఆయన నమ్మినబంటు. తొలి యూపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు వాపసు తీసుకున్నప్పుడు ఎస్పీ మద్దతు సంపాదించడంతో అమర్ కీలక పాత్ర పోషించారు.  ఆయనకు సినీ, వ్యాపార రంగాల్లో మంచి పలుకుబడి ఉంది. ‘హమారా దిల్ ఆప్కే పాస్ హై’ చిత్రంలో ఆయన రాజకీయ నాయకుడిగా నటించారు.  2010లో ఎస్పీ నుంచి బయటికొచ్చిన ఆయన 2011లో రాష్ట్రీయ లోక్ మంచ్ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నాడు. తర్వాత మళ్లీ ఎస్పీకి దగ్గరయ్యారు.