130 కోట్ల మందిలో తాగేది 16 కోట్లేనట! - MicTv.in - Telugu News
mictv telugu

130 కోట్ల మందిలో తాగేది 16 కోట్లేనట!

July 11, 2019

rajyasabha 16 crore people in India

దేశంలో మద్యపాన, మాదకద్రవ్యాల వినియోగంపై రాజ్యసభలో చర్చ జరిగింది. గురువారం బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయం, పర్యావరణ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ సమాధానమిచ్చారు. 

మంత్రి మాట్లాడుతూ.. 2018లో జరిపిన సర్వే ప్రకారం దేశ జనాభాలో 16 కోట్లకుపైగా ప్రజలు మద్యాన్ని సేవిస్తున్నారని రాజ్యసభకు తెలిపారు. వారిలో 10 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్కులు ఉన్నారని తెలిపారు. మిగతా మాదకద్రవ్యాల విషయానికి వస్తే గంజాయికి 3.1 కోట్ల మంది, డ్రగ్స్‌కు 77 లక్షల మంది బానిసలయ్యారని తెలిపారు.