ఎంపీ లపై ,పైర్ అయిన అమిత్ షా... - MicTv.in - Telugu News
mictv telugu

ఎంపీ లపై ,పైర్ అయిన అమిత్ షా…

August 1, 2017

రాజ్యసభలో బిజెపి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. రాజ్యసభలో బిజెపీ పార్టీ ఎంపీలు గైర్హాజరు పై భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతులకు సంబంధించిన బిల్లుకు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన, నాలుగు సవరణల పై ఓటింగ్ జరుపగా 74 -52 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. అయితే బిజెపి కి చెందిన 20 మంది ఎంపీలు గైర్హాజరైనట్టు సంభందిత వర్గాలు సమాచారం. ఇంకోసారి మళ్లీ ఇలా జరగకూడదని అమిత్ షా ఎంపీలను హెచ్చరించారు . గైర్హాజరు విషయంలో అమిత్ షా విప్ జారి చేసినా కూడా రాకపోవడం పై మండిపడ్డారు. విప్ జారి చేస్తే కచ్చితంగా హాజరుకావాలి. దీని పై అమిత్ షా తగిన చర్యలు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సదురు ఎంపీల తో నేరుగా మాట్లాడనున్నారు. అని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. ఇటీవల జరుగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కొందరు చెల్లని ఓట్లు వేశారని ,ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు అలా చేయద్దు అని సరిగ్గా ఓటు వేయాలని ఎంపీలకు అమిత్ షా సూచనలను చేశారు.