దేశంలో కొత్త ఎయిర్ లైన్స్.. ఫస్ట్ లుక్ అదుర్స్ - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో కొత్త ఎయిర్ లైన్స్.. ఫస్ట్ లుక్ అదుర్స్

May 23, 2022

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా విమానయాన రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అతి తక్కువ ఖర్చుకే విమానయానాన్ని దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆకాశ ఎయిర్’ పేరుతో దేశీయంగా(Domestic Service) విమానాలు నడిపేలా ఆకాశ ఎయిర్ ను ప్రారంభించారు. ఈ ఏడాది జులై నుంచి ఆకాశ ఎయిర్ విమానాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ విమానాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఎవరికీ తెలియదు. తాజాగా ఈ రోజు ఆ విమానాలకు సంబంధించి ఎంపిక చేసిన విమాన ఫోటోను కంపెనీ ఈ రోజు(సోమవారం) షేర్ చేసింది. ఆరంజ్, ఊదా రంగులలో చూడగానే ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన విమానాలు ఎంతో ముచ్చటగా ఉన్నాయంటూ సంస్థ తెలిపింది.

అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 18 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ ఎయిర్ క్రాఫ్ట్ లను ఆకాశ ఎయిర్ కొనుగోలు చేసింది. మొత్తం 72 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానాలను ఆకాశ ఎయిర్ ఆర్డర్ చేసింది. ఈ మేరకు మొదటి విడతగా తయారు చేసిన 18 విమానాలు మార్చి 23 నాటికి ఆకాశ సంస్థకు బోయింగ్ సంస్థ అప్పగించనున్నది. జెట్ ఎయిర్ వేస్ తో కలిసి 2022 మధ్య నాటికి పూర్తి స్థాయిలో విమాన సేవలు భావించాలని చూస్తుంది ఆకాశ ఎయిర్. కాగా, ఆకాశ ఎయిర్ సేవలను ప్రారంభించేందుకు రాకేష్ జున్‌జున్‌వాలా దాదాపు రూ.262 కోట్లు పెట్టుబడి పెట్టారు.