రాఖీ కట్టి వస్తుండగా.. అన్నాచెల్లెలు బలి - MicTv.in - Telugu News
mictv telugu

రాఖీ కట్టి వస్తుండగా.. అన్నాచెల్లెలు బలి

August 3, 2020

Rakha Bandhan incident ..Brother and sister no more.

ఈ రాఖీ పండగే ఆ అన్నచెల్లెలికి ఆఖరి పండగ అయింది. అన్నయ్య చేతికి రాఖీ కట్టిన ఆ చెల్లి, అనురాగంగా రాఖీ కట్టించుకున్న ఆ అన్నలు విధి వికృతంలో బలి అయ్యారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో వారి కుటుంబంలో, గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి స్టేజీ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. రాఖీ పండుగ వేళ రోడ్డుప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వీపనగండ్ల మండలం తూముకుంట గ్రామానికి చెందిన నందిని, దామోదర్‌ అన్నాచెల్లెలు. 

బైక్‌పై వెళ్తున్న వీరిని కొల్లాపూర్‌ డిపో బస్సు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పెద్దదగడ గ్రామానికి చెందిన సోదరుడికి రాఖీ కట్టడానికి దామోదర్, నందిని, లక్ష్మీలు కలిసి బైక్‌పై వెళ్లారు. రాఖీ కట్టి తిరిగి స్వగ్రామానికి పయనమయ్యారు.  జిల్లాలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామం వద్దకు రాగానే ఆర్టీసీ బస్సు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అన్నాచెల్లెలు మృత్యువాత పడ్డారు. మరో చెల్లెలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.