కేజీఎఫ్‌తో సినిమాతో యావత్ సినీ అభిమానులను అలరించిన కన్నడ హీరో యాష్ (రాఖీ భాయ్). ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్ 2’. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్ట్ 1 సినిమా ఎంతంటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్‌పై పడింది. దీంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను మరింత జాగ్రత్త తీశారు. పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న ఈ కేజీఎఫ్2లో అన్ని భాషలకు చెందిన నటీనటులు ఉండేలా చూసుకున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
ఈ క్రమంలో తాజాగా కరోనా తగ్గుముఖం పడడంతో ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగా సోమవారం సినిమాలోని తొలి పాటను విడుదల చేసింది. తుఫాన్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. బంగారు సామ్రాజ్యానికి అధినేతగా మారిన తర్వాత రాఖీ భాయ్ ప్రజలతో ఎలా కలిసిపోయాడన్న అంశాలను ఈ పాటలో చూపించారు. లిరిక్స్‌తో పాటు మ్యూజిక్ కూడా పాటకు హైలెట్‌గా నిలిచింది. పాటను విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది..