డబ్బివ్వకపోతే నీ బతుకు నాశనం చేస్తా.. రాఖీకి లవర్ వార్నింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

డబ్బివ్వకపోతే నీ బతుకు నాశనం చేస్తా.. రాఖీకి లవర్ వార్నింగ్

August 13, 2019

ప్రియుడి వేధింపులు స్టార్ హీరోయిన్లకు సైతం తప్పడంలేదు. పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌ను ఆమె మాజీ ప్రియుడు దీపక్ బెదిరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేయడం కలకలం రేపుతోంది. తనను రాఖీ సావంత్ మోసం చేసిందని దానికి రూ. 4 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. నాలుగు రోజుల్లో ఇవ్వకపోతే తన ‘జీవితాన్ని నాశనం చేస్తానంటూ’ హెచ్చరించారు. దీనికి ఆమె కూడా గట్టిగానే రియాక్ట్ అయింది. ‘నన్ను నువ్వు ఏం చేయలేవు.. నాగురించి కానీ నా భర్త గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఊరుకునేదిలేదు’ అంటూ ఇన్‌స్ట్రాగ్రాంలో వరుసగా వీడియోలు పోస్ట్ చేసింది. 

రాఖీ సావంత్ కొన్ని రోజుల క్రితం దీపక్ అనే వ్యక్తితో ప్రేమాయనం నడిపింది. ఓ దశలో వీళ్లు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ తరువాత ఇద్దరూ వీడిపోవడంతో రాఖీ సైలెంట్‌గా ఎన్నారై వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత అతడు యూకే వెళ్లిపోగా వీసా కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే మాజీ ప్రియుడు బెదిరింపులకు పాల్పడటం, డబ్బులు ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగానే చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కాగా మరికొన్ని రోజుల్లోనే రాఖీ సావంత్ తన భర్త దగ్గరకు వెళ్లి యూకేలోనే స్థిరపడనుంది.