చైనా వెళ్తున్నా..కరోనా అంతుచూసి వస్తా : రాఖీ సావంత్ (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

చైనా వెళ్తున్నా..కరోనా అంతుచూసి వస్తా : రాఖీ సావంత్ (వీడియో)

February 4, 2020

mjhvg

ప్రపంచం అంతా కరోనా పేరు వింటేనే భయపడిపోతుంటే బాలీవుడ్ నటి మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించారు. తరుచూ సంచలనాలతో వార్తల్లో నిలిచే నటి రాఖీ సావంత్ సరికొత్త సాహసానికి పూనుకున్నారు. తాను చైనాకు వెళ్తున్నానని, కరోనా అంతు చూసి వస్తానంటూ విమానంలో తీసుకున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె చెప్పిన ఈ మాటలు విడ్డూరంగా ఉండటంతో ఇది వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. 

విమానంలో కూర్చున్న రాఖీ సావంత్ ఎరుపు రంగు డ్రెస్ ధరించి ఓ వీడియో తీశారు. అందులో ‘నేను కరోనాకు ఏ మాత్రం భయపడటం లేదు. దానిపై పోరాడేందుకు చైనాకు వెళుతున్నాకరోనా వైరస్‌ను అంతమొందించిన తరువాతే  నేను ఊపిరి పీల్చుకుంటా. అందుకే ఇప్పుడు నేను చైనాకు వెళుతున్నా. దీనికి ఔషదాన్ని అందించాలని నాసాను కూడా అడుగుతా’ అంటూ రాఖీ స్పష్టం చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇంతకీ ఆమె ఎక్కడికి వెళ్తోంది. ఎందుకు ఈ వీడియో తీసింది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.