కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన రాఖీ సావంత్ - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన రాఖీ సావంత్

May 18, 2022

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉండే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తాజాగా తన కొత్త బాయ్ ఫ్రెండ్‌ని మీడియాకి పరిచయం చేసింది. ఇంతకు ముందు పెళ్లి చేసుకున్న మాజీ భర్త రితేశ్ సింగ్‌ తనను మోసం చేశాడని, తనతో పెళ్లికి ముందే అతనికి పెళ్లయి, పిల్లలున్నారని తెలిసి చాలా బాధపడ్డానని తెలిపింది. రితేశ్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వనందున తమ పెళ్లి చెల్లదని, అందుకే అతనికి దూరమైనట్టు వెల్లడించింది. ప్రస్తుతం తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన మైసూరుకు చెందిన అదిల్ దురానీతో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించింది. ‘పరిచయమైన నెలరోజుల్లోనే అతను నాకు ప్రపోజ్ చేశాడు. నాకంటే ఆరేళ్లు చిన్నవాడు కావడంతో మొదట అంగీకరించలేదు. కానీ, మలైకా – అర్జున్ కపూర్, నిక్ – ప్రియాంకల బంధం గురించి చెప్పి నన్ను ఒప్పించాడు. అంతేకాక, నాకు ఖరీదైన బీఎండబ్య్లూ కారు బహుమతిగా ఇచ్చాడ’ని తెలియజేసింది. ఇదిలా ఉండగా, రాఖీ సావంత్‌తో ప్రేమ వ్యవహారం అదిత్ దురానీ కుటుంబ సభ్యులకు నచ్చట్లేదు. దాంతో పాటు రాఖీ డ్రెస్సింగ్ స్టైల్‌పై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారంట. దాంతో వారిని ఎలాగైనా ఇంప్రెస్ చేస్తానని నమ్మకంతో ఉంది రాఖీ సావంత్.