ఫ్రస్టేటెడ్ రాఖీ
ఎప్పుడూ హల్ చల్ చేయటం రాఖీ నైజం అనుకోవచ్చు. కోడి పీతిల గెలికినట్టు ఎప్పుడూ ఏదో ఒకటి కెలకటం రాఖీ హాబీ అని కూడా అనుకోవచ్చు. నార్మల్ గా మాట్లాడటం, సింపుల్ గా వుండటం తనకస్సలు నచ్చదేమో.. అందుకే ఎప్పుడు చూసినా ఏదో ఒక గల్ ఫడీని మెడలో వేస్కంటుంటుంది. మికాసింగ్ లొల్లి, మోడీ ఫోటో వున్న డ్రెస్ వేస్కొని తన అభిమానాన్ని మొగులుకు ఆనెటట్టు చాటుకున్నది. అలాగే ఒక ఛానల్లో ‘ రాఖీకా స్వయంవర్ ’ అని ఒక ప్రోగ్రాం పెట్టి ఎంత ఓవరాక్షన్ చేసిందో తెల్సిన విషయమే. చివరగా ఒకర్ని సెలెక్ట్ చేస్కొని అలా పెళ్ళి చేస్కొని ఇలా వదిలేసింది ! ఐటంగర్ల్ గా ముద్రపడ్డ రాఖీకి వర్సగా అలాంటి ఆఫర్లే రాసాగాయి.
ఆ సాంగ్స్ షూటింగుల్లో ఏకంగా కొరియోగ్రఫర్లు, డైరెక్టర్లతోనే కొట్లాటలు పెట్టుకొని వస్తున్న ఆమ్ దానీకి గండి కొట్టుకున్నట్టు చేస్కుంది. ఏం చెయ్యాలో తోచక సన్నిలియోన్ని టార్గెట్ చేసింది. ‘తనలా నేను కూడా ఫోర్నోగ్రఫీలో నటిస్తే గానీ నాకెవ్వరూ అవకాశాలిచ్చేటట్టు లేరని, నేను ఐటం సాంగ్స్ మాత్రమే కాదు పర్ ఫార్మెన్స్ కూడా చింపేస్తా.. క్యారెక్టర్ ఇచ్చి చూస్తె రాఖీల ఎంత దమ్ముందో తెలుస్తుందని ’ చాలా కాంట్రవర్సీగా మాట్లాడిందప్పుడు. వర్మ సారు తీసిన ‘ మేరీ బేటీ సన్నిలియోని బన్నా చాహ్ తీ హై ’ షార్ట్ ఫిల్మ్ లో రాఖీని పెట్టుకుంటే సూపర్ మ్యాచ్ అయ్యేది. ఆ పాత్రకు రాఖీ అయుతే జబర్దస్త్ వుండేది. వర్మ దృష్ఠి ఎందుకు పడలేదో మరి రాఖీ మీద !? నెక్ట్స్ పార్ట్ లో అయినా తీస్కుంటే బాగుండేదేమో..