‘ రక్షా బంధన్ - సిస్టర్ ఫర్ ఛేంజ్ ’ ! - MicTv.in - Telugu News
mictv telugu

‘ రక్షా బంధన్ – సిస్టర్ ఫర్ ఛేంజ్ ’ !

July 31, 2017

ఆగస్టు 7 తారీకునాడు వస్తున్న ‘ రక్షా బంధన్ ’ సంధర్భంగా నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే ‘ రక్షా బంధన్ – సిస్టర్ ఫర్ ఛేంజ్ ’ సేఫ్ డ్రైవ్ – సేవ్ లైఫ్.. అనే బృహత్ కార్యక్రమం. అదీ మొన్న జరిగిన ఐటీ శాఖా మంత్రి పుట్టినరోజు సందర్భంగా ఈ సోషల్ అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రక్షాబంధన్ కు పక్షం రోజుల ముందే స్టార్ట్ చెయ్యటం విశేషం. ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం అక్కలు, చెళ్ళెళ్ళు తమ తోబుట్టువులకు రక్షా బంధన్ నాడు రాఖీ కట్టి హెల్మెట్ ను గిఫ్టు గా ఇవ్వాలన్నమాట.

దీనికి ప్రధాన కారణం ఇప్పటివరకు జరిగిన చాలా రోడ్డు ప్రమాదాలు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే జరుగుతున్నాయని, అదీ ద్విచక్ర వాహనాల మీద వెళ్ళేవారే ఎక్కువగా ఆక్సిడెంట్లకు గురై ప్రాణాలు వదులుతున్నారని. హెల్మెట్టుంటే దెబ్బలు తగిలినా, ప్రణాలు కాపాడుకోవచ్చు కదా అని కల్వకుంట్ల కవితక్క అభిప్రాయ పడుతున్నారు. 20 నుండి 25 సంవత్సరాల మధ్య వున్న యూతే ఎక్కువగా ఈ ప్రమాదాలకు గురై తమ విలువైన ప్రాణాలను రోడ్డు ప్రమాదాల్లో పోగొట్టుకుంటున్నారని, తదనుగుణంగా దేశానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన యువత అన్యాయంగా ప్రాణాలు పొగొట్టుకోవడం బాధ కలిగిస్తోందని, అందుకే హెల్మెట్ అత్యవసరం అని భావించి ఈ సిస్టర్ ఫర్ ఛేంజ్ కార్యక్రమానికి ‘ జాగృతి ’ సంస్థ తరుపున మొదలు పెట్టామని అంటున్నారు మంత్రి కవిత.

నిజమే చాలా మంది యూత్ వెంట్రుకలు రాలిపోయి మాడనెత్తి వస్తుందనే ఒకే ఒక్క కారణంతో హెల్మెట్లకు దూరంగా వుంటున్నారు. ఇది చాలా విచారించదగ్గ విషయం ?? అది కేవలం భ్రమ మాత్రమే. వెంట్రుకలు పోతే ఏముంది ? వస్తే వస్తాయి లేదా పోతాయి అంతేకదా ? తలే పోయి ప్రాణాలు పోతున్నాయి కదా ఇక్కడా ? హెల్మెట్లు వాడమని ఎప్పట్నించో ఎంతో మంది ఎన్ని రకాలుగా చెప్తున్నా ఎవ్వరూ మారట్లేదు. అందుకే కవితక్క ఇలా వైవిద్యంగా చెప్తేనైనా వీళ్ళు మారతారనే మంచి ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సానియా మీర్జా, గుత్తా జ్వాలా, పి.వి. సింధు వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి మద్దత్తు పలకడం విశేషం. ఈ రక్షా బంధన్ తర్వాత రోడ్డు మీద ఏ ఒక్కరూ హెల్మెట్ ధరిచంకుండా కనిపించకపోయి వుండటమే మా టార్గెట్ అంటున్నారు కవిత.

ఈ ఆలోచనకు బీజం ఎక్కడ పడింది ?

రక్షా బంధన్ – సిస్టర్ ఫర్ ఛేంజ్ అనే ఆలోచనకు బీజం ఎక్కడ పడిందంటే. వరంగల్ జిల్లాకు చెందిన వంశీకృష్ణ మేకల అనే యువకుడు ఒక సందర్భంలో కవితక్కను కలవడం జరిగింది. అప్పుడు తన దగ్గరున్న ఐడియాను అక్కకు వినిపించాడట. అక్క తన ఐడియాను వీడియో చేసి తీసుకురా అన్నదట. వెంటనే వెళ్ళి స్క్రిప్టు రాస్కొని, ఆర్టిస్టులను సెలెక్టు చేస్కొని, షూటింగ్ ఫినిష్ చేస్కొనొచ్చి అక్కకు చూపించాడట. అది చూసి అక్క చాలా ఇంప్రెస్ అయింది. వెంటనే ఆ మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిలింకు తన వాయిస్ ఇచ్చింది. ఇది జరిగింది 2016 లో. దీన్ని నెక్ట్స్ రక్షా బంధన్ కు ప్రమోట్ చేద్దామని అక్క మాటిచ్చింది. ఇంతకీ ఆ షార్ట్ ఫిల్మ్ పేరేంటంటే ‘ రక్షా బంధన్ ’. ఆరు నిమిషాల వ్యవధిలో మంచి మెసేజ్ ఫుల్ గా సాగుతుంది. ఆలోచింపజేస్తుంది.

రక్షా బంధన్ కథ

తక్కువ వ్యవధి గల ఈ రక్షా బంధన్ షార్ట్ ఫిల్మ్ లో ఎక్కడా మీకు ఒక్క డైలాగూ వుండదు. ఆర్ ఆర్ లో మొత్తం కథ చెప్పేస్తాడు దర్శకుడు వంశీకృష్ణ మేకల. ఆ సీక్వెన్స్ గురించి చెప్పుకుంటే రక్షాబంధన్ రోజున చెల్లెలు తన ఇద్దరన్నయ్యలకు రాఖీ కడుతుంది. అన్నలిద్దరూ చెల్లెలికి డబ్బులు గిఫ్టుగా ఇస్తారు. అమ్మానాన్నలు సహా అందరూ చాలా హ్యాప్పీగా వుంటారు. కట్ చేస్తే నెక్ట్స్ రాఖీ పండగకు సేమ్ చెల్లి అన్నకు రాఖీ కట్టడానికొచ్చి ఏడుస్తుంటుంది. గోడమీద పెద్దన్నయ్య ఫోటోకు దండేసి వుంటుంది. తను గత సంవత్సరం యాక్సిడెంటులో హెల్మెట్ లేకపోవడం వల్ల తల పగిలి చచ్చిపోతాడతడు. అది గుర్తు చేస్కొని ఇంటిల్లాదులందరూ బాధ పడ్తారు.

అప్పుడు చెల్లి చిన్నన్నయ్యకు ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తుంది. దాన్ని ఓపన్ చేసి చూస్తే అందులో హెల్మెట్ వుంటుంది. ఆ హెల్మెట్ ను ఆనందంగా తీస్కుంటాడు చిన్నన్న. హెల్మెట్ లేని కారణంగా ఒక అన్నను పోగొట్టుకొని ఇంకొక అన్నను అలా పోగొట్టుకోలేననే చెల్లెలు ఆవేదనలో గొప్ప అర్థం వుంది. అలా వితౌట్ కన్వర్జేషన్ ఈ షార్ట్ ఫిల్మ్ సాగి చూసిన ప్రతీ ఒక్కరినీ కదిలించి, అదిలిస్తుంది. ‘ వజ్రాలు కావాల నాయనా ’ హీరో అనిల్ బూరగాని ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. మిగతా నటీనటులు జబర్దస్త్ శ్రీధర్, హరిక ఇన్నమూరి, చంద్రమౌళి , రాం తులసిలు చాలా బాగా నటించారు. ఈ చిత్రం 29-07-2017 నాడు రవీంద్ర భారతి వేదికగా ‘ సినివారం ’ లో ప్రదర్శించారు. తెలంగాణ కల్చర్ డిపార్టుమెంటు డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ గారు ఈ చిత్రాన్ని మెచ్చుకొంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

వంశీకృష్ణ మేకల

కవితక్క ఎప్పుడైతే ఈ ‘ రక్షా బంధన్ – సిస్టర్ ఫర్ ఛేంజ్ ’ అనే కంపెయిన్ను స్టార్ట్ చేసిందో అప్పట్నించి ‘ రక్షా బంధన్ ’ అనే షార్ట్ ఫిలింను, దాని రూపకర్త వంశీ పేరును చాలా సార్లు మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. ఎవరు ఈ వంశీకృష్ణ మేకల అనే క్వశ్చన్ చాలా మందిలో రైజ్ అయింది ? అతను రెడ్లవాడ గ్రామం, నెక్కొండ మండలం, వరంగల్ రూరల్ కు చెందిన యువకుడు. సినిమా దర్శకుడిగా రాణించాలని కలలు గంటున్న ఫ్యూచర్ డైరెక్టర్. అతను గతంలో పోలీస్ వ్యవస్థ మీద సలాం పోలీస్, మై డాడీ గ్రట్ పోలీస్ అనే రెండు మంచి మెసేజ్ ఇచ్చే షార్ట్ ఫిల్మ్స్ తీసి అవార్డులు కూడా గెలుచుకున్నాడు. ఇప్పుడు ఈ రక్షాబంధన్ షార్ట్ ఫిల్మ్ తో ఒక్కసారిగా వెలుగులోకొచ్చాడు. ఫ్యూచర్లో మంచి సినిమా దర్శకుడిగా రాణించాలనుకుంటున్న వంశీకృష్ణ మేకలకు ఆల్ ద బెస్ట్ చెబుదామా !

– సంఘీర్

https://www.youtube.com/watch?v=r5I2wJcN6sA&list=