కడితే కట్టించుకోవాలి ! - MicTv.in - Telugu News
mictv telugu

కడితే కట్టించుకోవాలి !

August 2, 2017

ఆగస్టు 8 నాడు వస్తున్న రక్షా బంధన్ ను అధికారిక ఉత్సవంగా మార్చాలని ఆదేశించాడు గురుప్రీత్ సింగ్. ఈయన డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ఏఆర్ సెక్రటేరియంట్ దమాన్ అనే సంస్థలో డిప్యూటి సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు.

సాంప్రదాయ పండుగైన రాఖీ పండగనాడు వివిధ ఆఫీసుల్లో మహిళా కొలీగ్స్ రాఖీ కడితే కట్టించుకోవాలని సర్క్యులర్ సారాంశం. ఇది కొంచెం కొందరికి ఇబ్బందికరంగా, చాలా మందిని ఇరుకున పెట్టేలాగా కూడా వుందని విమర్శలు వినబడుతున్నాయి.

సంప్రదాయాలు, ఆచారాలను ఇలా అధికారికంగా ఇతరుల మీద రుద్దాలని రూలు లేదు కదా ? అది మనిషికి సంబంధించిన సాంస్కృతిక ఉత్సవం. దాన్నిలా అధాకారికంగా చెయ్యటం ఏం బాగా లేదని అంటున్నారు కొందరు.