జవాన్లకు రాఖీ కట్టిన విద్యార్ధినులు..! - MicTv.in - Telugu News
mictv telugu

జవాన్లకు రాఖీ కట్టిన విద్యార్ధినులు..!

August 4, 2017

వాగా బోర్డర్లో రాఖీ సంబురాలు ఘనంగా జరిగాయి..స్కూల్ విద్యార్థినులు  బీఎస్ఎఫ్ జవాన్లకు రాఖీలు కట్టారు. స్వీట్లు పంచి జవాన్లకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా బార్డర్ చుట్టుపక్కలా పండగ వాతావరణం నెలకొంది. ఆ తరువాత  వాగా బోర్డర్ల బీఎస్ఎఫ్ జవాన్ల బీటింగ్ రీట్రీట్ సెర్మని బాగా జరిగింది.జవాన్ల పరిస్ధితి ఎలా ఉంటుందో మనకి తెలుసు..ఎప్పుడు తింటారో తెలియదు,ఎప్పుడు పంటారో తెలీదు,ఇల్లు వాకిలి,భార్య బిడ్డల్ను ఉన్న ఊరిని వదిలి దేశ రక్షణకోసం నిరంతరం పాటు పడతారు జవాన్లు…వాళ్లు ఊరికెళ్లినప్పడే పండుగ.వాళ్ల సంతోషాలన్నీ త్యాగం చేసి దేశంకోసం ప్రాణాలను సైతం త్యాగం చెయ్యడానికి సిద్దపడతారు.హాట్సాఫ్ టు జవాన్.హాఫీ రక్షాబందన్ టు జవాన్.