కండోమ్ టెస్టర్‌గా రకుల్! - MicTv.in - Telugu News
mictv telugu

కండోమ్ టెస్టర్‌గా రకుల్!

March 8, 2022

31

టాలీవుడ్‌లో కథనాయిక రకుల్ ప్రీత్‌సింగ్ గురించి తెలియని వారుండరు. ఓవైపు తెలుగు సినిమాలు చేస్తూనే, మరోవైపు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బీజీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్‌లో ‘ఛత్రీవాలీ’ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కండోమ్‌ టెస్టర్‌గా కనిపించబోతుందట. కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్‌ అయి.. ఉద్యోగం కోసం వెతికే ఓ అమ్మాయికి ప్రొఫెషనల్‌ కండోమ్‌ టెస్టర్‌గా ఉద్యోగం వస్తుంది. అయితే బయట ఈ జాబ్ చేస్తున్నాం అంటే ఏమంటారనో, బయట, ఇంట్లో చెప్పకుండా జాబ్ చేసే మహిళగా రకుల్ కనిపించబోతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే సమస్యల్ని వినోదాత్మక కోణంలో చూపిస్తూ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవలే పూర్తి అయింది. దీంతో ఈ మూవీ పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులతో పాటు ప్రమోషన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన రకుల్‌.. చత్రీవాలిలో తన పాత్ర గురించి వివరించింది. ‘ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటి నుంచో మన సమాజంలో ఉన్నదే. దీనినే మేము సరికొత్త ప్రయత్నంలో ప్రేక్షకులకు చూపెట్టబోతున్నాం. అందరూ మెచ్చేలా ఓ కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కించాం. ఇది ఒక చిన్న పట్టణం నుంచి వచ్చి.. కండోమ్ టెస్టర్ క్వాలిటీ హెడ్‌గా మారిన ఓ అమ్మాయి కథ. మొదట జీతం కోసమే జాబ్‌లో చేరిన ఆ యువతి అనంతరం దాని ప్రాధాన్యత ఏంటో తెలుసుకుంటుంది’ అని చెప్పుకొచ్చింది.

అలాగే ‘మనం ఎలా పుడతామో అందరికీ తెలుసు. కానీ దాని గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడతాం. యువతకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. వారికి ఏం చేయాలో, ఏం చేయకూడదో స్పష్టంగా తెలియాలి’ అని తెలిపింది. ఇప్పటిదాకా ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు కాబట్టి సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్ తీసుకున్న రకుల్ ను కొందరు అభినందిస్తుంటే, కొంతమంది ఇలాంటి క్యారెక్టర్ అవసరమా అంటూ విమర్శిస్తున్నారు.