బిజినెస్ ఉమెన్.. మొన్న జిమ్, నేడు టెన్నిస్ టీంతో రకుల్ - MicTv.in - Telugu News
mictv telugu

బిజినెస్ ఉమెన్.. మొన్న జిమ్, నేడు టెన్నిస్ టీంతో రకుల్

September 15, 2019

Rakul Preet buys a team in Tennis Premiere League

దీపం వుండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సిద్ధాంతాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాగా ఒంటబట్టించుకున్నట్టుంది. అటు సినిమాల్లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతూనే ఇటు వ్యాపారాలు చక్కదిద్దుకుంటోంది. హీరోయిన్ల లైఫ్ మహా అయితే పది ఏళ్లు. లేదంటే పదిహేనేళ్లు. ఈ సమయంలోనే ఇంకో ట్రాక్ ఎంచుకుంటే రేపు హీరోయిన్‌గా రిటైర్ అయ్యాక చక్కా బిజినెస్ చూసుకోవచ్చని భావిస్తోంది ఈ చిన్నది. ఇప్పటికే హైదరాబాద్‌లో ‘ఎఫ్ 45’ పేరుతో జిమ్ వ్యాపారం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అది సక్సెస్ అవడంతో.. హైదరాబాద్‌లో రెండు బ్రాంచ్‌లు, వైజాగ్‌లోను ఓ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది. ఈ జిమ్  వ్యాపారం బాగా కలిసిరావడంతో మరో వ్యాపారంలోకి అడుగుపెట్టాలని రకుల్ భావిస్తోంది.

ఇప్పటికే రకుల్ స్ట్రైకర్స్ క్లబ్ అనే టెన్నిస్ స్పోర్ట్స్ క్లబ్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం అండర్ 14, 18 ప్లేయర్స్ ఉన్నారు ఈ క్లబ్‌లో. భవిష్యత్తులో ప్రొఫెషన్స్‌గా ప్లేయర్స్‌ను తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ లాగానే ఇండియాలో టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లో క్లబ్‌కు ప్రవేశం కల్పించాలని భావిస్తోంది. ఐపీఎల్‌లో ప్రీతి జింటా, శిల్పా శెట్టిలు విజయం సాధించినట్టే తాను కూడా టెన్నిస్‌లో విజయం సాధించాలనుకుంటోంది. కాగా, రకుల్ ‘కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమా అంతగా ఆడలేదు. కానీ,  ఆ తర్వాత వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తిరుగులేని తారగా ఎదిగింది. మొన్న విడుదల అయిన ‘మన్మథుడు2’ సినిమాలో రకుల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.