ఆనందంల రకుల్ ప్రీత్ ! - MicTv.in - Telugu News
mictv telugu

ఆనందంల రకుల్ ప్రీత్ !

June 17, 2017

బోణీయే బాలీవుడ్ లో కొట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ‘ యారియాం ’ సినిమా మ్యూజికల్ హిట్టుగానే నిలబడింది కానీ రకుల్ కు ఎందుకనో అక్కడ నెక్ట్స్ అవకాశాలు రాలేకపోయాయి. తెలుగులో ‘ కెరటం ’ సినిమాతో వచ్చింది కానీ ఆ సినిమా తనకు నిరాశనే మిగిల్చినా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ఒక్కసారిగా తన రేంజును పెంచేసి బిజీ స్టార్ ను చేసింది. వరస హిట్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీకి చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుండి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. స్పెషల్ ఛబ్బీస్, బేబీ వంటి సినిమాలు తీసిన నీరజ్ పాండే డైరెక్షన్ లో ‘ ఐయారీ ’ అనే సినిమాలో, అదీ సిద్ధార్థ్ మల్హోత్ర పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం రావడంతో రకుల్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.