వేశ్యగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

వేశ్యగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్

November 18, 2019

rakul preet singh  .

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు బిజీగా ఉంటూనే.. హిందీలో కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో హింది ఏ అవకాశం వచ్చినా చేస్తోంది. తాజాగా ఆమె నటించిన ‘మార్జావా’ చిత్రం విడుదలైంది. ఇందులో రకుల్ వేశ్య పాత్రలో నటించింది. మిలాప్ జవేరీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా, తారా సుతారియా జంటగా నటించారు. జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ మరుగుజ్జుగా కనిపించే విలన్ పాత్రలో నటించారు.

రకుల్.. సిద్ధార్థ్ కోసం పరితపిస్తున్న ఆర్జూ అనే వేశ్య పాత్రలో నటించారు. రకుల్ వేశ్య పాత్రలో నటించడంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. విశ్లేషకులు కూడా తమ విశ్లేషణల్లో ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడంలేదు. దీంతో వేశ్య లాంటి ఛాలెంజ్‌జింగ్ పాత్రలో నటించినప్పటికీ పేరు రాకపోవడంతో బాధపడడం రకుల్ వంతైంది. ఈ సినిమాలో రకుల్ ఒక పాటలో కనిపిస్తుంది. అలాగే సిద్ధార్థ్‌తో పాటు బెడ్ రూమ్ సీన్లలో కనిపిస్తోంది. గతంలో శృతి హాసన్ ‘డి-డే’ అనే సినిమాలో వేశ్య పాత్రలో నటించింది. తాజాగా సీనియర్ నటి రమ్యకృష్ణ తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్‌’లో వేశ్య పాత్రలో నటించింది.