రకుల్ సీన్‌కు.. తప్పని సెన్సార్ కట్ - MicTv.in - Telugu News
mictv telugu

రకుల్ సీన్‌కు.. తప్పని సెన్సార్ కట్

May 16, 2019

టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌తో కలిసి ‘దే దే ప్యార్ దే’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు తన అంద చందాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసిన రకుల్.. ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో సెన్సార్ సభ్యులు కొన్ని కట్స్ సూచించారు.

rakul preet singh ajay devgn De De Pyaar De Sancercut...

ఈ సినిమాలోని ‘వడ్డీ షరాబన్’ అనే పాటలో రకుల్ ప్రీత్‌ సింగ్‌ విస్కీ బాటిల్‌ పట్టుకొని డాన్స్ చేయడంపై సెన్సార్‌ బోర్డ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ సీన్‌ను కట్ చేయటం లేదా..? బాటిల్‌‌కు బదులుగా పూలు పట్టుకున్నట్టుగా గ్రాఫిక్స్‌ చేయాలని సూచించారు. మరికొన్ని కట్స్‌తో ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. అకీవ్ అలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీ సిరీస్ సంస్థ నిర్మించింది. ఇందులో అజయ్ ప్రియురాలిగా రకుల్, ఆయన మాజీ భార్యగా టబు నటిస్తున్నారు.