హీరోయిన్ లైఫ్ పదేళ్లే .. రకుల్ ప్రీత్ సింగ్ ! - MicTv.in - Telugu News
mictv telugu

హీరోయిన్ లైఫ్ పదేళ్లే .. రకుల్ ప్రీత్ సింగ్ !

July 21, 2017

హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలో పదేళ్ళు వుండటమనేది చాలా గొప్ప విషయం అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడొస్తున్న చాలా మంది హీరోయిన్లు తమ లైఫును చాలా తక్కువ నిడివితో బిచాణా కట్టేస్తున్నారు. కొందరైతే ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి ఆ తరం హీరోయిన్లు చాలా కాలం హీరోయిన్లుగా చెలామణి అయ్యారు. ఇప్పుడొస్తున్న హీరోయిన్లలో అనుష్క, నయనతార, త్రిష వంటి హీరోయిన్లు కాస్త లాంగ్ టైమ్ లైమ్ లైట్ ను అనుభవిస్తున్నారు. అంటున్న రకుల్ కు తన ఫ్యూచర్ కూడా పదేళ్ళని అనుకుంటుందేమో.

నిజమే మన దగ్గర హీరోయిన్లకు ముఫ్పై వయసు వచ్చిందంటే చాలు తనను ఎవ్వరూ పట్టించుకోరు. అవకాశాలు అస్సలు ఇవ్వరు. అదే బాలీవుడ్, హాలీవుడ్ లలో అయితే హీరోయిన్ కు ఫిఫ్టీ వచ్చినా హీరోయిన్గా అవకాశాలు ఇస్తుంటారు. ఐశ్వర్యారాయ్, ప్రియాంక ఛోప్రా, మాధురీ ధీక్షిత్ వంటి సీనియర్ హీరోయిన్లు ఇప్పటికీ హీరోయిన్లుగా చేస్తున్నారు. హాలీవుడ్ లో హాలీబెర్రీ, ఎంజులినా జోలీ వంటి సీనియర్లు ఇప్పటికీ ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ తమ సత్తా చాటుతున్నారు.

మన తెలుగుకు వచ్చేసరికి ప్లేట్ పూర్తిగా ఫిరాయించుకుపోతుంది. హీరోయిన్ కు పొరపాటున పెళ్ళి అయిందంటే ఇంక అస్సలు ఆమెను ఎవ్వరూ పట్టించుకోరు. కొత్త కొత్త వాళ్ళను నార్త్ నుండి దిగుమతి చేసేస్తుంటారు. అదే హీరోకి పెళ్ళైనా, మనవలు, మనవరాళ్ళున్నా వాళ్ళు దర్జాగా హీరోలుగా తొడలు కొడుతుంటారు. వయసు మరిచి ఎగిరెగిరి దూకుతూ వీరోచితంగా ఫైట్లు చేసేస్తుంటారు. అరవై, డెబ్భై వచ్చినా ఎంచక్కా విగ్గులు పెట్టుకొని హీరోలుగా తమ మనవరాలు వయసున్న హీరోయిన్లతో స్టెప్పులేస్తుంటారు. కానీ హీరోయిన్లు పెళ్ళి అవగానే ఫేడ్ అవుట్ అయిపోవాల్సిందే ? హీరోల విషయంలో పర్సనల్ విషయాలు పట్టింపుకు రావు గానీ హీరోయిన్ విషయానికొచ్చేసరికి పర్సనల్ విషయాలు బాగా పట్టింపుకొస్తాయి. దీనికి ప్రధానమైన కారణం సినిమా రంగాన్ని పురుష భావజాలమే ఏలుతోంది కాబట్టి. మొత్తానికి రకుల్ మంచి విషయమే చెప్పింది. మనవాళ్ళు ఎప్పటికైనా హీరోయిన్ల విషయంలో తమకున్న ప్రలోభాలను మార్చుకుంటే బావుంటుందేమో.