డ్రగ్స్‌ కేసు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్ - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్‌ కేసు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్

September 17, 2020

jkgh

బాలీవుడ్‌లో డ్రగ్ కేసు కలకలం రేపుతోంది. రోజుకో కొత్త సెలెబ్రిటీ పేరు తెరపైకి వస్తుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన రియా చక్రవర్తి కీలక పేర్లను వెల్లడించింది. ఇందులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సహా మరో 25 మంది పేర్లను వెల్లడించింది. వారిలో సారా అలీఖాన్, నటుడు రణ్‌వీర్ సింగ్, ప్రముఖ డిజైనర్ సిమోన్ ఖంబట్ట కూడా ఉన్నారని తొలుత ‘టైమ్స్ నౌ’ ఛానల్ లో కథనాలు వచ్చాయి. తరువాత మిగతా జాతీయ మీడియా ఛానల్ లలో కూడా వరుసగా కథనాలు వస్తున్నాయి. 

మీడియాలో రోజూ చర్చలు జరుగుతున్నాయి. దీంతో మీడియాలో తనపై వస్తున్న వార్తల నేపథ్యంలో రకుల్ ఈరోజు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల తన గురించి మీడియాలో వచ్చిన కథనాలను ఆమె తన లాయరు ద్వారా కోర్టుకి అందజేసింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ మీడియా వార్తలు రాస్తోందని తెలిపింది. డ్రగ్స్ కేసులో తనకు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న కవరేజీ ఆపాలని సమాచార, ప్రసార శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్ నవీన్ చావ్లా ముందు విచారణ జరుగనుంది.