సినీ పరిశ్రమలో పుకార్లు షికార్లు చేస్తున్న అందమైన జంటల్లో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానిలు ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ లవ్ బర్డ్స్ అంటూ బాలీవుడ్ టు టాలీవుడ్ రూమర్స్ ఉన్నాయి. అందమైన ఫిజిక్, వరుస సినిమాలు, వివాదాలతో నిత్యం రకుల్ ప్రీత్ లైమ్ లైట్ లో ఉంటుంది. ఇవన్నీ ఒకెత్తయితే ఈ హాట్ బ్యూటీ మ్యారేజ్ రూమర్స్ మరోఎత్తు. బాలీవుడ్ నటుడు, నిర్మత జాకీ భగ్నానితో రకుల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పటివరకు అవునని కానీ, కాదని కానీ రకుల్ ఎక్కడ తన వ్యవహారంపై స్పందించలేదు. అయితే మొన్న క్రిస్మస్ సందర్భంగా మాత్రం తన అభిమానులకి హింట్ ఇచ్చేసింది రకుల్.
View this post on Instagram
2022 డిసెంబర్ 26న రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో జాకీతో కలిసున్న ఫోటోలని షేర్ చేసింది. క్రిస్మస్ వేడుకలని జాకీతో కలిసి జాలిగా ఎంజాయ్ చేస్తున్నట్టు పేర్కొంది. శాంటా తనకి ఇచ్చిన అద్భుతమైన బహుమతి అంటూ తన ప్రియుడు జాకీ గురించి చెప్పుకొచ్చింది. క్రిస్మస్ వేడుకల ఫోటోలని ఇన్స్టాలో పోస్ట్ చేసిన రకుల్ మాట్లాడుతూ.. ‘తనకు శాంటా ఇచ్చిన గిఫ్ట్ జాకీ’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అధికారికంగా పెళ్లిపై వీరిద్దరు ఎలాంటి ప్రకటన చేయకున్నా.. రకుల్ దాదాపు తన భర్త జాకీనే అంటూ హింట్ ఇచ్చేసిందని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
పవన్ – బాలయ్యల సెట్స్ లో సెక్యూరిటీ లోపం.. భారీ గందరగోళం ?
భగభగ మండే వాల్తేరు వీరయ్య.. టైటిల్ సాంగ్ వచ్చేసింది
పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా సోహెల్ ?