ఔనా, మెడికల్ షాపులో మద్యం అమ్ముతారా?:రకుల్
లాక్ డౌన్ లోనూ మద్యం దుకాణాలను ఓపెన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. మద్యంప్రియులు ఎగబడి మద్యం కొనుగోలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Oh wow ! I wasn’t aware that medical stores were selling alcohol ??? https://t.co/3PLYDvtKr0
— Rakul Singh (@Rakulpreet) May 7, 2020
ఈ వీడియోల్లో నటి రకుల్ ప్రీత్‌సింగ్ చిన్న చిన్న బాటిల్స్‌తో ఓ షాప్ నుంచి బయటికి వస్తున్న వీడియో కూడా వైరల్ అయిన సంగతి తెల్సిందే. రకుల్ ప్రీత్ సింగ్ మద్యం కొనుగోలు చేసిందంటూ కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోపై తాజాగా రకుల్ ప్రీత్‌సింగ్ స్పందిస్తూ..'ఓ.. వావ్ మెడికల్ షాపుల్లోనూ మద్యం అమ్ముతారని నాకు తెలియదు.' అని వ్యంగ్యంగా తెలిపింది.