రిక్షా తొక్కిన రకుల్...! - MicTv.in - Telugu News
mictv telugu

రిక్షా తొక్కిన రకుల్…!

July 26, 2017

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే  సినిమాతో  టాలీవుడ్ లో అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్,ఆ తర్వాత  పెద్ద పెద్ద హీరోలతో నటించే అవకాశాలు చాలానే వచ్చాయి,అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్,అయితు తాజాగా రకుల్ రిక్షా తొక్కింది,లక్షలు ఖరీదు చేసే  కారుల్లో తిరగాల్సిన హీరోయిన్..రిక్షా తొక్కడమేంటి అన్కుంటున్రా…అంతా సినిమా కోసమే, ఈ గ్లామరస్ బ్యూటీ  ఇప్పుడు   కార్తీతో  ‘థీరన్‌ అథికరం ఒండ్రు’ చిత్రంలో నటిస్తుంది,ఈ మూవీ చిత్రీక‌ర‌ణ పుదుచ్చేరిలో జ‌రుగుతుంది, ఓ స‌న్నివేశంలో భాగంగా ర‌కుల్ రిక్షా తొక్కింది,ఈ సీన్ కోసం ముందుగానే రకుల్ రిక్షా తొక్కడం ప్రాక్టీస్ చేసిందట, అయితే ఈసినిమా  తెలుగులో ఖాకీ  పేరుతో విడుద‌ల కానుంది. ర‌కుల్ ఇటు టాలీవుడ్ లోనే కాకుండా, కోలీవుడ్ లో ,బాలీవుడ్ లోను వ‌రుస ఆఫర్స్ అందుకుంటుంది. ర‌కుల్ తెలుగులో నటించిన స్పైడ‌ర్, జ‌య జాన‌కి నాయ‌క చిత్రాలు విడుద‌ల కి సిద్ధంకి సిద్దంగా ఉన్నాయి.