హాట్ డ్యాన్స్‌తో నెటిజన్లను షేక్ చేస్తున్న రకుల్.. వీడియో వైరల్
టాలీవుడ్‌లో పాపులర్ అయిన పంజాబీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా చేసిన డ్యాన్సు వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే యూట్యూబులో 20 కోట్ల వ్యూస్‌తో దూసుకెళ్లిన ‘పసూరి’ పాటను రకుల్ తన స్టెప్పులతో ఇన్‌స్టాగ్రాంలో విడుదల చేయగా, గంటలోనే 3 లక్షల వ్యూస్ రావడం విశేషం. ఈ పాటకు రకుల్ చేసిన నాట్య భంగిమలు ఇంతకు ముందెన్నడూ చూడనివి. ప్రస్తుతం ఆమె సెలెబ్రిటీ కొరియోగ్రాఫర్ డింపుల్ దగ్గర డ్యాన్సులో శిక్షణ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ డ్యాన్సు వీడియో రూపొందించారు. పూర్తి డిఫరెంట్ స్టైల్‌తో కనిపించిన రకుల్ ఈ వీడియోలో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోపై నెటిజన్లు హాట్ కామెంట్లు చేస్తుండగా, రకుల్ బాయ్ ఫ్రెండ్, నటుడు జాకీ భగ్నానీ కూడా స్పందించాడు. డియర్ లవ్.. నాక్కూడా నేర్పించవా అంటూ కామెంట్ చేశాడు. కాగా, వైష్ణవ్ తేజ్‌తో నటించిన కొండపొలం సినిమానే రకుల్ నటించిన చివరి తెలుగు చిత్రం. ఆ తర్వాత ఏ చిత్రానికీ ఆమె సంతకం చేయలేదు. అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ టైంలో ‘పాన్ ఇండియా సినిమాలు రూపొందిస్తున్న టాలీవుడ్‌కు అభినందనలు. నాక్కూడా ఓ పాన్ ఇండియా సినిమాలో అవకాశం ఇవ్వండి’ అంటూ నిర్మాతలు, దర్శకులను విన్నవించుకుంది. అయితే ఆమె చేసిన విన్నపాన్ని ఎవరూ సీరియస్ తీసుకున్నట్టు కనిపించలేదు. ఈ డ్యాన్స్ వీడియోతోనైనా రకుల్ పాన్ ఇండియా కోరిక తీరుతుందేమో చూడాలి.