నదులను రక్షించడం కోసం ర్యాలీ - MicTv.in - Telugu News
mictv telugu

నదులను రక్షించడం కోసం ర్యాలీ

September 14, 2017

గచ్చిబౌలి స్టేడియం లో జరిగిన ర్యాలీ ఫర్ రీవర్స్ కార్యక్రమానికి  గవర్నర్ నరసింహన్, మంత్రి హరీష్ రావు, ఎంపీలు కేకే, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిలు పాల్గోన్నారు. ఈ సంధర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లడుతు 33% అడవుల విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.ఆదిలాబాద్ , ఖమ్మం లో చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల వర్షాలు ఎక్కువగా పడుతున్నాయని తెలిపారు. నదుల సంరక్షణ కు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, ప్రపంచంలో లొనే మూడవ అతిపెద్ద కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం అని తెలిపారు.చైనా ,బ్రెజిల్ తరువాత తెలంగాణా లో 230 కోట్ల మొక్కలు నాటినట్టు తెలిపారు. మిషన్ కాకతీయ 46 వేల చెరువులు మరమ్మతులకు శ్రీకారం చుట్టినట్టు వివరించారు , ఇప్పటికే 20 వేల చెరువులకు మరమ్మతులు చేసినట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు.

గవర్నర్ నరసింహన్ ఇలా అన్నారు.

సద్గురు ఇచ్చిన ర్యాలీ ఫర్ రీవర్ కార్యక్రమానికి కి అందరూ కలిసి రావాలి తెలిపారు.మిషన్ కాకతీయ , హరిత హారం వంటి కార్యక్రమాలో స్వయంగా పాలుపంచుకొన్నాట్టు అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు పర్యావరణ రక్షణ చేపడుతున్నాయని. షేర్ వాటర్ అండ్ కేర్ వాటర్ అనే నినాదం తో ముందుకు వెళ్ళాలని పిలుపు నిచ్చారు.