‘ప్రసాదు’లకు నేపాలీలతో పెళ్లిచేస్తున్న వీహెచ్‌పీ - MicTv.in - Telugu News
mictv telugu

‘ప్రసాదు’లకు నేపాలీలతో పెళ్లిచేస్తున్న వీహెచ్‌పీ

November 19, 2019

'Ram Baraat' to go from Ayodhya to Nepal on November 21

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్‌ తదిర రాష్ట్రాల్లో పెళ్లికాని ప్రసాదుల కష్టం తీరింది.  విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ధర్మయాత్ర మహాసంఘ్‌ వారిని ఒకటి వారిని చేయనుంది. వారికి నేపాలీ యువతులతో పెళ్లి చేస్తామని వెల్లడించింది. సీతాదేవి జన్మస్థలమైన జనక్‌పూర్‌(నేపాల్‌) అమ్మాయిలను వివాహం పేరుతో ఒకటి చేయబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు యూపీ నుంచి మొత్తం 108 మంది తమ పేరును నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ వివాహ వేడుకను ‘శ్రీరామ్‌-జానకి వివాహ్‌ బరాత్‌ యాత్ర- అయోధ్య సే జనక్‌పూర్‌’ పేరుతో నిర్వహించనున్నట్లు.. ఈ వేడుకను 13 రోజుల పాటు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 

నవంబర్‌ 21 నుంచి డిసెంబర్ 4 వరకు ఈ వివాహ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అయోధ్యలోని  కర్‌సేవక్‌పురమ్‌ జంకి ఘాట్‌ నుంచి కన్య పూజ, తిలకోత్సవం పేరుతో మొదలై  గోరక్‌పూర్‌లో జరిగే బరాత్‌ కార్యక్రమంతో ముగుస్తుందని అన్నారు. వివాహాలు నేపాల్‌లోని ధశరథ్‌ మందిర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ముగింపు వేడుకలకు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ హాజరవుతారని అన్నారు. ఈ వేడుకుకు సంబంధించి యూపీ నుంచి అంబేద్కర్‌నగర్‌, మావు, అజామ్‌ఘర్‌, బీహార్‌ నుంచి బక్సర్, పటలీపుత్ర, హాజీపూర్‌, ముజఫర్‌పూర్‌, దర్బంగా, మోతీహరి, సీతామర్హి ప్రాంతాలను స్వాగత ద్వారాలుగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 

ఈ వివాహాల గురించి కార్యక్రమ నిర్వాహకుడు రాజేంద్ర సింగ్‌ పంకజ్‌ మాట్లాడుతూ.. ‘ఈ కార్యక్రమం భారత్‌- నేపాల్‌ మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేస్తుంది. అంతేగాక సంప్రదాయంలో ఒకే విధంగా ఉండే రెండు దేశాల మధ్య అడ్డు ఉన్నది సరిహద్దు మాత్రమే.  రామ మందిర నిర్మాణం చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో దీనిని ముడిపెట్టొద్దు. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ఇలాంటి వేడుకను నిర్వహిస్తుంటాం. అయితే ఈసారి యాదృశ్చికంగానే మాకు కలిసి వచ్చింది’ అని వెల్లడించారు.

 కాగా, వివాదాస్పద అయోధ్య భూవివాదం కేసుకు సంబంధించి ఇటీవల సుప్రీకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్యలో  రామ మందిర నిర్మాణం కోసం వీహెచ్‌పీ చేసిన పోరాటం మనందరికీ తెలిసిందే. తాజాగా వీరు తీసుకున్న నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తోంది.