ram charan gave intresting update about his hollywood entry
mictv telugu

హాలీవుడ్ ఎంట్రీపై రామ్‎చరణ్ అప్‏డేట్

March 8, 2023

ram charan gave intresting update about his hollywood entry

ప్రపంచ వేదికపై ఆర్ఆర్ఆర్ ప్రభంజనం సృష్టించింది. ఆస్కార్ రేసులో ఇండియన్ సినిమాను నిలబెట్టి మన ఫిల్మ్ మేకర్స్ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఈ మూవీలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్‏చరణ్ వరల్డ్ వైడ్‏గా భారీ క్రేజ్‏ సంపాదించుకున్నాడు. తనదైన ప్రత్యేకమైన పెర్ఫార్మెన్స్‏తో గ్లోబల్ స్టార్‏గా కీర్తించబడుతున్నాడు. ఇప్పటికే మన స్టార్‏పై హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ల కన్నుపడిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్‏చరణ్ ఆస్కార్ ఈవెంట్ కోసం రెండు వారాల ముందే యూఎస్ లో వాలిపోయాడు. ఓ వైపు తన భార్య ఉపాసనతో వెకేషన్‏ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రామ్ పాల్గొన్నాడు.

 

ఈ ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ డెబ్యూ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు రామ్. తన నటనను ఇష్టపడే ప్రేక్షకులుంటూ ఏ దేశంతో అయినా పని చేసేందుకు సిద్ధమేనన్నాడు రామ్. ప్రస్తుతం తన హాలీవుడ్ డెబ్యూ గురించిన చర్యలు నడుస్తున్నాయని త్వరలో బిగ్ న్యూస్‏తో ముందుకు వస్తానని చెప్పాడు. హాలీవుడ్‏లో పనిచేయాల్సి వస్తే ముందుగా ఫిల్మ్ మేకర్ జూలియా రాబర్ట్స్ తన టాప్ లిస్ట్ లో ఉంటారని పేర్కొన్నాడు. ఆమెతో కలిసి ఒక్క సినిమా అయినా చేస్తానన్నాడు. ఆమె సినిమాలో అతిధి పాత్రైనా ఓకే అన్నాడు.