ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్తో పోలిస్తే తన పాత్ర డామినేటెడ్గా ఉండడంపై రాంచరణ్ తొలిసారి స్పందించారు. బుధవారం జరిగిన చిత్ర సక్సెస్ మీట్లో భాగంగా ఓ జర్నలిస్టు ఈ అంశంపై ఆయనను ప్రశ్నించాడు. దానికి రాంచరణ్ జవాబిస్తూ ‘నా పాత్ర డామినేషన్ చేసిందనడంలో ఎలాంటి నిజం లేదు. ఇద్దరం బాగా నటించాం. ఎన్టీఆర్ నటన చాలా బాగుంది. అతనితో కలిసి పనిచేయడం మంచి అనుభవం. కథకు తగ్గట్టు మమ్మల్ని మలచిన దర్శకుడికి కృతజ్ఞతలు. సినిమా కోసం ఎంత కష్టపడ్డామో, అంత ఆస్వాదిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఈ చిత్రం బాలీవుడ్లో 200 కోట్లను వసూలు చేసింది. మొత్తం వసూళ్లు రూ. 900 కోట్లను దాటి, వెయ్యికోట్ల మార్కును త్వరలో సాధించబోతోంది. ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని జోరుగా చర్చ నడుస్తోంది.