Ram Charan met with his childhood teacher in Rajahmundry
mictv telugu

రామ్ చరణ్ మనసు బంగారమే.. చిన్ననాటి టీచర్ ని గుర్తుపెట్టుకుని మరీ

October 18, 2022

చిరంజీవిలోని క్రమశిక్షణ, పవన్ కళ్యాణ్ లోని మంచి తనం, తనదైన నటనతో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు రామ్ చరణ్. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ ని డామినేట్ చేసేలా నటించి అందరిని ఒకింత షాక్‌కి గురిచేశాడు. ‘వామ్మో రామ్ చరణ్ కళ్ళల్లో ఆ ఇంటెన్సిటీ ఏంటీ’ అంటూ ఎన్టీఆర్ కూడా ప్రమోషన్స్‌లో అవాక్కయ్యాడు. అయితే చరణ్ క్రేజ్, పర్ఫామెన్స్ పక్కనపెడితే ఇండస్ట్రీలో ఆయన వ్యక్తిత్వంపై చర్చ ఎక్కువగా ఉంటుంది. మాట ఇస్తే అస్సలు వెనక్కి వెళ్లడన్న టాక్ చరణ్ పై ఉంటుంది. ఇక అంతపెద్ద మెగా ఫ్యామిలీ వారసుడు అయినా.. ఎప్పటికైనా చిరు, పవన్ తరువాత వెలుగొందే మెగా హీరో అయినా కూడా.. చరణ్ లో కించెత్తు గర్వం ఉండదట. అందుకే రామ్ చరణ్ మనసు బంగారం అంటుంటారు అభిమానులు. వీరి ఆరాధన అక్షరాలా నిజం అన్నట్టు తాజాగా నిరూపించాడు రామ్ చరణ్. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు చరణ్. ఈ మూవీ షూటింగ్ మొన్న రాజమండ్రిలో జరుగగా.. ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఓ గ‌మ్మ‌త్త‌మైన విష‌యం జ‌రిగింది. రామ్ చరణ్ కి చిన్నప్పుడు పాఠాలు చెప్పిన టీచర్ రాజమండ్రిలోనే ఉందని తెలుసుకుని..

షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఆమెకు ఫోన్ చేసి వెళ్లి మ‌రీ ప్ర‌త్యేకంగా రామ్ చరణ్ క‌లిశారు. ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. సాధార‌ణంగా చ‌దువు చెప్పిన టీచ‌ర్స్‌ను చాలా మంది గుర్తు పెట్టుకుంటారు. అది స‌హ‌జం. కానీ ఇన్నేళ్లైన త‌ర్వాత ఓ టీచ‌ర్ త‌ను షూటింగ్ చేస్తున్న ప్రాంతంలో ఉన్నార‌ని తెలియ‌గానే వెళ్లి క‌ల‌వ‌టం అనేది అరుదైన విష‌య‌మే. ఏదేమైనా మా చెర్రీ మ‌న‌సు బంగారం అని అంటున్నారు ఆయ‌న అభిమానులు. ఇక శంకర్ మూవీలో డ్యూయల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు చరణ్. అవినీతి ముఖ్యమంత్రి, కఠినమైన ఐఏఎస్ ఆఫీసర్ వంటి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చరణ్ చేస్తున్నట్టు టాక్. ఐఏఎస్ లుక్స్ ఇప్పటికే బయటికొచ్చినా.. ముఖ్యమంత్రి గెటప్ లో చరణ్ ఎలా ఉండనున్నాడన్నది ఆసక్తి కలుగచేస్తుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లుక్స్ లో చరణ్ కనిపిస్తారని వార్త అయితే ఒకటి ఉండటం గమనార్హం.