ram charan mother in law dance for natu natu song
mictv telugu

నడిరోడ్డుపై రామ్ చరణ్ అత్త స్టెప్పులు..!

January 18, 2023

 

ram charan mother in law dance for natu natu song

అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ శోభనా కామినేని నడిరోడ్డుపై స్టెప్పులు వేశారు. తన కూతురు ఉపాసనని పెళ్లిచేసుకున్న అల్లుడు రామ్ చరణ్ పాటకి అద్దిరిపోయే డాన్స్ చేశారు. అంతర్జాతీయ అవార్డులు కొల్లగొడుతూ. .ఆస్కార్ కి అడుగు దూరంలో ఉన్న నాటునాటు పాటకి వేసిన ఈ డ్యాన్స్ వీడియోని కూతురు ఉపాసన ముచ్చటపడి మరి సోషల్ మీడియాలో షేర్ చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశానికి ప్రపంచ ప్రముఖులు తరలివస్తున్న స్విస్ పట్టణంలోని దావోస్‌ నగరంలో డ్యాన్స్ వేసిన తరువాత శోభనా కామినేని మాట్లాడుతూ.. ఈ చిత్రానికి వచ్చిన ప్రశంసలను చూడటం చాలా అద్భుతంగా ఉందని చెప్పారు.

అయితే ఇండస్ట్రీలో నంబర్ వన్ డ్యాన్సర్ రేసులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన హీరో రామ్ చరణ్. స్టెప్స్ లో ఈజ్, స్టైల్ తండ్రి మెగాస్టార్ ని గుర్తు చేస్తుంది. చరణ్ డ్యాన్సులకి ఫిదా కానివారు ఎవరు ఉండరు. బన్నీ, ఎన్టీఆర్ లాంటి బెస్ట్ డ్యాన్సర్లు ఉన్నా.. చరణ్ షార్ప్ మూవ్స్ కి కొరియోగ్రాఫర్స్ సైతం అభిమానులైపోతారు. అలాంటి చరణ్ పాటకి అత్త కామినేని కూడా వీరాభిమాని అయిపోయి చిందులేశారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. దానిపై రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న సోష‌ల్ మీడియాలో రియాక్ట్ అయ్యింది. ల‌వ్ యు అమ్మ‌.. గ‌ర్వంగా ఫీల్ అవుతున్న అత్త‌గారు.. దావోస్‌లో నాటు నాటు స్టెప్పులు అంటూ వీడియో పాటు మెసేజ్‌ను కూడా షేర్ చేసింది ఉపాస‌న ఇప్పుడా వీడియోను మెగాభిమానులు నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు.