ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జనం నోళ్ళల్లో నానుతున్న టాలీవుడ్ హీరోల్లో ఒకరు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమా క్రేజ్ తో చరణ్, ఎన్టీయార్ కు ఫుల్ క్రేజ్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్ కూడా అమాంతం పెరిగిపోయారు. ఇన్స్టాలో అతన్ని ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
View this post on Instagram
టాలీవుడ్ లో చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఇన్సటాలో యాకటివ్ గా ఉంటారు. రామ్ చరణ్ కూడా అతని అప్ డేట్స్ ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటాడు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ స్టేటస్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పడు ఇన్స్టాలో అతన్ని ఫాలో అవుతున్న వారి సంఖ్య 12 మిలియన్లు. ఇంతకు ముందే ఈ నంబర్ ను రీచ్ అయిన తెలుగు హీరోలు ఉన్నారు కానీ అతి తక్కువ సమయంలో 12 మిలియన్లకు చేరింది మాత్రం చరణే. ఇది రికార్డ్. బన్నీకి 19.9 మిలియన్స్, 17.8 మిలియన్స్ విజయ దేవరకొండకు ఫాలోవర్స్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
జగిత్యాలలో నాపై కోడిగుడ్లు విసిరారు : చిరంజీవి
నన్ను పాన్ ఇండియా స్టార్ అనకండి-విజయ్ సేతుపతి