ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ అందుకున్న రాంచరణ్ తేజ్ తర్వాత శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి రకరకాల పేర్లు ఇప్పటివరకు ప్రచారంలోకి వచ్చాయి.అధికారి అని, కామన్ మ్యాన్ అని ఇలా రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చిన చివరికి ఈ సినిమాకి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ శంకర్ సినిమా పేరు చెప్తూ ఒక వీడియో విడుదల చేశారు.
ఈ టైటిల్ రివ్యూ వీడియో ఆసక్తికరంగా సాగింది. చివరి నిమిషం వరకు టైటిల్ రివ్యూ చేయకుండా చివరి నిమిషంలో ఈ సినిమాకి గేమ్ చేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాదు ఇవాళ మధ్యాహ్నం 3.06 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒకటి ఫ్లాష్ బ్యాక్ లో మరొకటి ప్రజెంట్ అన్నట్లు చరణ్ పాత్రలు ఉండొచ్చని అంచనా. ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ కు జోడీగా అంజలి ఉండే అవకాశం ఉంది. ఈ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే రామ్ చరణ్ లుక్స్ కి సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు బయటకు లీకయ్యాయి. అందులో రామ్ చరణ్ ఒక పీరియాడిక్ లుక్ లో సైకిల్ తొక్కుకుంటూ బయటకు వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. శంకర్ సినిమాని పెద్దగానే ప్లాన్ చేశారని అనుకుంటున్నారు.