కొడుకు ఎదుగుతుంటే మొదట సంతోషించే కన్నతండ్రే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కూడా అదే ఆనందంలో ఉన్నారు. RRRలో రాంచరణ్ యాక్టింగ్ కు వరల్డ్ వైడ్ ప్రశంసలు అందుకున్నారు. పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు చిరంజీవి. కాగా రాంచరణ్ వరుస ఇంటర్వ్యూలతో అమెరికాలో చాలా బిజీగాఉన్నారు. ఈ క్రమంలోనే టాక్ ఈజీ పాడ్ క్యాస్ట్ లో హోస్ట్ సామ్ ఫ్రాగోసోతో రాంచరణ్ మాట్లాడుతూ తన తండ్రి గురించి చెప్పుకొచ్చారు.
మాకంటూ సొంత గుర్తింపు ఉండాలన్నదే నాన్న తాపత్రాయం. ఆయన ఎప్పుడూ స్టార్ డమ్ లను తలకెక్కించుకోలేదు. దాన్ని మా దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చూశారు. తనకు వచ్చిన అవార్డుల గురించి రాసిన మ్యాగజైన్లు ఇలా అన్నింటినీ ఇంట్లో కింద ఉన్న ఆఫీసులోనే ఉంచేవారు. ఇంట్లోకి ఏదీ తీసుకొచ్చేవారు కాదు. ఒక్క అవార్డును కూడా ఇంట్లో పెట్టలేదు. తనోగొప్ప స్టార్ అని మేము గర్వంగా ఫీల్అవ్వకూడదనే ఇలా చేశారని చెప్పారు.
ఇక మమ్మల్ని సాధారణ పిల్లల వలే పెంచారు. స్టార్ కిడ్స్అన్నట్లుగా ఎప్పుడూ చూడలేదు. తాను సినీపరిశ్రమలో ఒక పెద్ద హీరో అనే విషయం మాకు తెలియజేసేందుకు కూడా ఇష్టపడలేదు. చిరంజీవితో సులభంలో సినీఇండస్ట్రీలోకి అడుగుపెట్టొచ్చ అన్న భావన మాలో ఏనాడూ కలగలేదు. ఆయన చేసిందంతా మా మంచికే. ఆయన పెంపకం వల్లే నేను ఈరోజూ ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పటికీ నా ఈఎంఐలు నేను కట్టుకుంటానంటూ చెప్పుకొచ్చారు మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ