మగధీర బుడ్డోడు ఇక లేడు ! - MicTv.in - Telugu News
mictv telugu

మగధీర బుడ్డోడు ఇక లేడు !

July 15, 2017

 

హీరో రాంచరణ్ అంటే పరుశురామ్ కు చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే ఆయన సినిమాలోని డైలాగ్ లను అవలీలగా, విత్ యాక్షన్ తో చెప్పి హీరో రామ్ చరణ్ ని మెప్పించగలిగాడు. కానీ ఆ పసివాడి అభిమానానికి ఏ దిష్టి తగిలిందో పాపం కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. పన్నెండేళ్ళు కూడా నిండి వుండవు అప్పుడే నూరేళ్ళు నిండి శాశ్వతంగా వెళ్ళిపోయాడు పరుశురామ్. కొంత కాలంగా జాండీస్ తో బాధ పడుతున్నాడట. అత్యంత పిన్న వయసులో రామ్ చరణ్ సినిమాల్లోని డైలాగ్ లను పద్యాలను పలికినట్టే పలికి అప్పట్లో చాలా మందిని మెస్మరైజ్ చేసిన ఆ పసివాడు పరలోకాలకు పయనమయ్యాడు. అతని తల్లిదండ్రులు తీరని శోకసంద్రంలో మునిగిపోయారు. తమ కొడుకు బ్రైట్ ఫ్యూచర్ తో వెలిగిపోతాడనుకున్న వారి కలల మీద కన్నీళ్ళ వర్షం ఎడతెరిపి లేకుండా కురిపిస్తూ వెళ్ళిపోయాడు ?

అప్పట్లో రామ్ చరణ్ కూడా అతని చదువు బాధ్యతను తనే నిర్వర్తిస్తానని కూడా హామీ ఇచ్చాడు.
మగధీర సినిమాలోని డైలాగ్ లను విత్ యాక్షన్ తో చెప్పి హీరోలే తన ఫ్యన్స్ అయ్యేంత ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు. చిరంజీవి, బాలకృష్ణ డైలాగులను సైతం ఇరగదీసి చెప్పేవాడు. అలాంటి పరుశురాం సడన్ గా చనిపోవడంతో రామ్ చరణ్ తీవ్ర మనస్తాపానికి గురై తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసాడు.

https://www.facebook.com/JanaSenapartyjsp/videos/661377350731726/