క్రిస్టమస్ పండగ సమీపిస్తుండడంతో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. దేశ వ్యాప్తంగా క్రిస్టమస్ సెలబ్రేషన్స్‌ను జరపుకుంటున్నారు. ఇక ఎప్పటిలాగే మెగాహీరోలందరూ క్రిస్ మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామ్ చరణ్, ఉపాసన ఏర్పాటు చేసిన వేడుకలకు మెగా కాంపౌడ్ హీరోలందరూ హాజరయ్యారు. అల్లు అర్జున్ దంపతులు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, నిహారికతో పాటు ఇతర కుటుంబ సభ్యులు వేడకలో పాల్గొన్నారు. . అందరూ కలిసి సందడి చేశారు. వేడుకలు అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. అయితే ఇందులో చిరంజీవి కనబడడం లేదు. ఇందుకు సంబంధించిన గ్రూప్ ఫొటోలను ఉపాసన ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ లో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి. మెగా హీరోలను ఒకదగ్గర చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అల్లు,మెగా ఫ్యామిలీ మధ్య ఎలాంటి విబేధాలు లేవని కామెంట్లు చేస్తున్నారు. సంక్రాంతి, దీపావలి, క్రిస్టమస్ వంటి పండగలను మెగా హీరోలంతా కలిసి జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే.
Mega cousins #secretsanta ❤️🥳🎄
Lots of love & happiness pic.twitter.com/araFYLu0bn— Upasana Konidela (@upasanakonidela) December 21, 2022
ఇక రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయాన్ని ఇటీవల చిరంజీవి ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా బేబీ బంప్‌తో ఉపాసన కనిపించిన ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి. ఓ ఫ్యామిలీ పార్టీ కోసం రామ్ చరణ్ దంపతులు ఇటీవల థాయ్ లాండ్ కు వెళ్లారు. అక్కడ ఫ్యామిలీ తో కలసి సరదాగా దిగిన కొన్ని ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఉపాపన బేబీ బంప్‌తో కనిపిస్తోంది.