రామ్ చరణ్ ఏడుస్తున్న ఒక బాలుడికి సెల్ఫీ ఇచ్చి మనసున్న మారాజుగా పేరు తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మరొక విషయమేంటంటే.. తను నటించబోయే తర్వాతి సినిమాకి చాపర్ ఎంట్రీకి సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నది.
రామ్ చరణ్ ఇప్పుడు నెట్టింట ప్రభంజనం సృష్టిస్తున్నాడు. అటు ఫార్ములా వన్ రేసు దగ్గర కనిపించాడు. ఇటు చూస్తే షూటింగ్ ల్లో బిజీ. అంతేకాదు.. ఇటు ఫ్యాన్స్ ను సంతోష పెట్టడంలోనూ ముందున్నాడు. ఇంతలా మరి రామ్ చరణ్ ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఇది చదువండి.
దర్శకుడు శంకర్ తో తన రాబోయే బహుభాషా చిత్రం చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. దీనికి సంబంధించిన షూటింగ్ విశాఖపట్నంలో ఒక క్యాంపస్ లో జరిగింది. ఇక్కడకి చెర్రీ చాపర్ నుంచి దిగాడు. అభిమానులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్న తరుణంలో చాపర్ నుంచి దిగాడు చెర్రీ. దీంతో చెర్రీ కొత్త లుక్ మీద అందరి దృష్టి పడింది. ఇదంతా ఆర్సీ 15 కోసమేనా? అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇందులో చెర్రీ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని టాక్. ఈ సినిమా కోసం 10 కోట్లు పెట్టి ఫ్యాష్ బ్యాక్ సీక్వెన్స్ కోసం సెట్ వేశారని ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపించింది.
అభిమాని కోసం..
ఏ నటుడికైనా.. నటికైనా బయటకు వస్తే సెల్ఫీలు కావాలని అడుగుతుంటారు. వారు కూడా ఓపికతోనే దిగుతుంటారు. కానీ కొన్నిసార్లు భద్రతా కారణాల వల్ల దగ్గరకు రానివ్వరు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో చెర్రీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక్కడికి వెళ్లినా అభిమానులు చుట్టుముడుతున్నారు. అలాగే ఒక బాలుడు తన అభిమాన నటుడైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గరకు వెళ్లాలనుకున్నాడు. అందరినీ దాటుకొని రామ్ చరణ్ ని చేరుకున్నాడు. వెంటనే చెర్రీ భద్రతా సిబ్బంది అడ్డుకోబోయారు. దీంతో ఆ పిల్లాడు ఏడుపు అందుకున్నాడు. ఇదంతా గమనించిన చెర్రీ అందరినీ ఆపి బాలుడిని దగ్గరకు తీసుకున్నాడు. ప్రేమగా ఓదార్చాడు. దీంతో ఆ పిల్లాడు కూడా రామ్ చరణ్ తో మాట్లాడి, సెల్ఫీ దిగి వెళ్లిపోయాడు. అయితే ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతున్నది. మంచి మనసున్న మారాజుగా అందరి మన్ననలు పొందుతున్నాడు చెర్రీ.
#rc15 #ramcharan landing entry sence 💥 , #gitam #gimsergrounds pic.twitter.com/QPZzQAMx8e
— Rajesh (@Rajesh136189) February 12, 2023