ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించడంతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పుడు చరణ్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పైనే అందరి నజర్ పడింది. ప్రస్తుతం చరణ్ శంకర్ కాంబినేషన్లో సీఈఓ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. త్వరలో బిగ్ స్క్రీన్ ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో శంకర్ మూవీ తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి రామ్ చరణ్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. అభిమానులను ఖుషీ చేశాడు.
తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో చరణ్ తనకు ఎంతోకాలంగా స్పోర్ట్స్ బయోపిక్‌లో నటించాలని కోరిక ఉందని తెలపాడు. ఛాన్స్ వస్తే టీం ఇంటియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ బయోపిక్‌లో నటిస్తానని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అంతే కాదు ఈ ఈవెంట్లో కోహ్లిని పొగడ్తలతో ముంచేశాడు చెర్రీ. కీడ్రా రంగంలో విరాట్ కోహ్లీ ఓ అద్భుతమని, అతను ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అని తెలిపాడు. ఒకవేళ కోహ్లి బయోపిక్‌లో నటించే ఛాన్స్ వస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వదులుకోనని చెప్పాడు. ఏమాటకామాట, లుక్స్ పరంగా కూడా కోహ్లి పోలికలు నా పోలికలు కొంచెం దగ్గరదగ్గరగానే ఉంటాయని , ఇదే నా అడ్వాంటేజ్ అని తెలిపాడు. ఇప్పటికే ప్రయోగాత్మక చిత్రాల్లో వైవిధ్యమైన నటనతో స్టార్డమ్ సంపాదించుకున్న చరణ్ స్పోర్ట్స్ బయోపిక్ చేయాలన్న తన ఆసక్తిని ఫ్యాన్స్ కూడా ఆహ్వానిస్తున్నారు.
ఇక మరోవైపు రామ్ చరణ్ ఇదే వేదికపై నెపొటిజంపైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు..” నాన్న ద్వారానే ఇండస్ట్రీకి వచ్చాను, నాకు టాలెంట్ లేకపోతే ఇక్కడి వరకు రావడం చాలా కష్టం. ప్రతిభ ఉంటే కచ్చితంగా ప్రేక్షకులు ప్రోత్సహిస్తారు. అసలు ఈ నెపొటిజం అంటే ఏమిటో నాకు అర్ధం కావడం లేదు. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను. సినిమానే నా ఊపిరి. నా మనసుకు నచ్చిన పని చేయడం వల్లే 14 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాను. నాన్న ప్రోత్సాహంతో నాకు నేనుగా నా కెరీర్‌ను డిజైన్ చేసుకున్నాను.