తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు విషెష్ చెప్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల సందడి ఎలాగూ ఉన్నా, సోషల్ మీడియాలో కూడా కేటీఆర్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, నాగచైతన్య, రవితేజ, ఆర్జీవీ, హరీష్ శంకర్, సోనూసూద్, అనసూయ వంటివారు విష్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే వీటన్నింటిలోనూ తాజాగా రాం చరణ్ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. కేటీఆర్ని బ్రదర్ అంటూ సంబోధించడం ఆసక్తికరంగా ఉంది. ‘నా ప్రియమైన సోదరుడు, అత్యంత కష్టపడి పని చేసే నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. దీనికి రిప్లై ఇస్తూ ‘థ్యాంక్యూ బ్రదర్. ఆర్ఆర్ఆర్ సినిమాలో నీ నటన గురించి గొప్పగా చెప్తుంటే వింటున్నా. త్వరలో నీ సినిమా తప్పకుండా చూస్తా’నని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Thanks Brother 🙏
Been hearing rave reviews on your performance in RRR. Will finally watch it soon https://t.co/8F4k7Q48gg
— KTR (@KTRTRS) July 24, 2022