పెయ్యిల బొక్కలు లేనట్టే బాడీని స్ప్రింగ్ లెక్క అటూ ఇటూ తిప్పుకుంట యోగా చేసే రాందేవ్ సాముల వారు, ఉగ్రవాదులు యోగా చెయ్యాలని పిలుపునిచ్చారు.యోగాకు మనుషుల మెదడును శుద్ధి చేసే సామర్థ్యం ఉందని, కశ్మీర్ లోయలో కల్లోలం సృష్టిస్తున్న వారి ఆలోచన విధానాన్ని యోగా మారుస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు.
యోగా సాధన చేసేవాళ్లు ఎవ్వరూ ఎప్పటికీ ఉగ్రవాది కారు అని బాబా రాందేవ్ స్పష్టంచేశారు. కశ్మీర్లో హింసపై స్పందిస్తూ..అన్ని మతాలను గౌరవించేలా పిల్లలను పెంచాలని, దీనివల్ల సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయని సాములవారు సెలవిచ్చారు.కశ్మీర్ లోయలో హింసకు పాల్పడుతున్న వారి ఆలోచన విధానాన్ని యోగా మారుస్తుందని ఈ సందర్భంగా రాందేవ్ అన్నారు.