'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సీక్వెల్ ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సీక్వెల్ ప్రకటన

November 16, 2019

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే వివాదాస్పద సినిమా తీస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా వర్మ మరో బాంబ్ పేల్చాడు. ఆ సినిమాకు సిక్వెల్‌గా మరో సినిమా తీస్తాన్నని ఈరోజు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 

టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ టీడీపీ నాయకులపై ఫైర్ అవుతున్న ఇంటర్వ్యూలు చూసిన తర్వాత తనకు ఈ ఐడియా వచ్చిందని తెలిపాడు. ఈ సీక్వెల్‌కు ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అనే పేరు పెడతానని ప్రకటించాడు. మరోవైపు వర్మ సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలోని పాటలలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.