‘ రాధేశ్యామ్’ కు అంత సీన్ లేదన్న ఆర్జీవీ - MicTv.in - Telugu News
mictv telugu

‘ రాధేశ్యామ్’ కు అంత సీన్ లేదన్న ఆర్జీవీ

March 18, 2022

fvbfv

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రం రాధేశ్యామ్. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకుంది. మాస్ ప్రేక్షకులను ఈ సినిమా నిరాశ పరిచింది. చాలా మంది ప్రభాస్ రేంజ్ సినిమా కాదు ఇది అనే కామెంట్లు చేశారు. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాధేశ్యామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమ కథల్లో ఎమోషన్, డ్రామా బాగుండాలి కానీ, విజువల్ ఎఫెక్ట్స్ అంత అవసరం లేదన్నారు. భారీ స్థాయిలో గ్రాఫిక్స్ పెట్టడం వల్ల కథకి డ్యామేజ్ జరుగుతుందని వెల్లడించారు. ప్రభాస్ పారితోషికం పక్కన పెడితే ఈ సినిమాకు అంత ఖర్చు అవసరం లేదని విశ్లేషించారు. పెట్టిన ఖర్చులో ఐదో వంతు డబ్బులతోనే ఈ కథను చెప్పవచ్చని ట్వీట్ చేశారు. దీనికి ఉదాహరణగా ది కశ్మీర్ ఫైల్స్‌ను చూపారు. విడుదల వరకు ఈ సినిమా గురించి ఎవ్వరికీ తెలియకపోయినా, కథ, కథనంతో పెద్ద సినిమా స్థాయిలో వసూళ్లు రాబడుతుందని స్పష్టం చేశారు. రాధేశ్యామ్‌కు పెట్టిన బడ్జెట్‌కు, వస్తున్న కలెక్షన్లకు అసలు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. కాగా, వర్మ కామెంట్లపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.