కాంట్రవర్సీ కామెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నాలికకు పనిచెప్పారు. నారార్జున యూనివర్సిటీ అకాడెమిక్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి హాజరైన్ రామ్ గోపాల్ విద్యార్ధులను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారి తీస్తున్నాయి. వీసీ, ప్రొఫెసర్ల ముందే విద్యార్ధులతో చాలా అసభ్యకరంగా మాట్లాడి మరోసారి వార్తల్లో నలిచారు. రామ్ మాటలకు వీసీ వత్తాసు పలకడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య రచ్చ రచ్చ చేస్తున్నాడు. రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తూ యూత్‌ను రెచ్చగొడుతున్నారు. సెలబ్రిటీలతో అభ్యంతరకరమైన ఇంటర్వ్యూలు చేస్తూ తన క్రేజ్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా వర్మ మేయర్ పై రకరకాల వీడియోలు చేసి రెచ్చిపోయాడు. తాజాగా చదువుల బడి అయిన యూనివర్సిటీలో యువతను తప్పుదారి పట్టించేలా మాట్లాడి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు.
నాగార్జున వర్సిటీలో వర్మ మాట్లాడుతూ.. ” స్టూడెంట్స్ మీరంతా మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి..ఎవరి మాటా వినకండి.. అప్పుడే మీరు మీ జీవితంలో పైకి వస్తారు. ప్రొఫెసర్లు, పేరెంట్స్ దయచేసి పిల్లలకు రిస్ట్రిక్షన్స్ పెట్టి టార్చర్ చేయకండి. స్టూడెంట్స్ మీకు నచ్చింది తినండి, నచ్చిన బ్రాండ్ మందు తాగండి..మీకు నచ్చిన వారితో ఉండండి. రేపు మీరు చనిపోతే పైన ఓ స్వర్గం ఉంటుందని, అక్కడ రంభ, ఊర్వశులు ఉంటారని ఏమాత్రం ఊహించకండి. ఒకవేళ అక్కడ వారు లేకపోతే ఏం చేస్తారు. అందుకే బ్రతికున్నంత వరకు మీకు నచ్చినట్లు బ్రతకండి ఎంజాయ్ చేయండి. నా డ్రేమ్ ఏంటో చెప్పనా..ఏదైనా వరైస్ వచ్చి భూమి మీద ఉన్న మగాలంతా చనిపోవాలి. నేను ఒక్కడినే బ్రతకాలి..అప్పుడు భూమి మీద ఉన్న మహిళలందరికి నేను ఒక్కడినే ఆప్షన్ కావాలి. అంటూ మాట్లాడిన రామ్ మాటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈయన కాంట్రవర్సీ కామెంట్స్ దుమ్మురేపుతున్నాయి. వర్మ ఒక ప్రొఫెసర్ కంటే ఎక్కువని, ఆస్కార్ కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయి అంటూ వర్మ తీరుకు యూనివర్సిటీ వీసీ వత్తాసు పలకడంతో అక్కడ ఉన్నవారంతా విస్తుపోయారు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా స్టాప్, విద్యార్ధినులు ఆర్జీవీ స్పీచ్ విని షాక్‌కు గురయ్యారు. వారంతా ఇబ్బంది పడినట్లు సమాచారం.