ram gopal varma going to act in prabhas project k movie
mictv telugu

వరుస ఫ్లాప్స్ లో ఉన్న వర్మకి మద్దత్తుగా.. ప్రభాస్ షాకింగ్ డెసిషన్..!

November 12, 2022

ram gopal varma going to act in prabhas project k movie

ఆర్జీవీ పేరు కాదు బ్రాండ్. వరుస ఫ్లాప్స్ లోను క్రేజీ క్రేజ్ కంటిన్యూ చేస్తున్నఏకైక దర్శకుడు. సినిమాలతో సంబంధం లేకుండా వర్మ వ్యక్తిత్వాన్ని అభినందిస్తుంటారు. నర మానవుడు జీర్ణించుకోలేని నగ్న సత్యాలని మాట్లాడటంలో వర్మ దిట్ట. ఎదుటువాడు ఎంతటివాడైనా తనదైన శైలిలో తూర్పార పట్టడం వర్మకి వెన్నతో పెట్టిన విద్య. ట్రంప్, మోదీ, చంద్రబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా తన సినిమాల్లో ఎవర్నైనా ఏదైనా అనేస్తాడు. అందుకే ఏపీ సీఎం జగన్ ముచ్చట పడి వర్మతో అర గంట పాటు పిచ్చాపాటి ఖబుర్లు చెప్పుకున్నారు. అలాంటి వర్మకి డై హార్డ్ ఫ్యాన్ ప్రభాస్. ఆర్జీవిని విపరీతంగా అభిమానించే ప్రభాస్ తాజాగా ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. తన నెక్స్ట్ ప్రాజెక్టు లో వర్మ గారికి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ తన దర్శకుడికి విన్నవించుకున్నాడట ప్రభాస్. ఆ సినిమా మరేదో కాదు.. ప్రాజెక్టు K .

అశ్విని దత్ నిర్మాణంలో.. ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం ప్రాజెక్టు K. అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో, దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం ఈ కాంట్రవ‌ర్సీయ‌ల్ డైరెక్ట‌ర్ ని సజెస్ట్ చేశాడట ప్రభాస్. రామ్ గోపాల్ వ‌ర్మ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌టం కొత్తేమీ కాదు..ఈ మ‌ధ్య ఆయ‌న‌ త‌ను డైరెక్ట్ చేసే సినిమాల్లోనే త‌ళుక్కున మెరిశారు. అయితే బ‌య‌ట ద‌ర్శ‌కుల సినిమాల్లో ఆయ‌న న‌టించ‌లేదు ఫస్ట్ టైం ప్రభాస్ కోరిక మేరకు వర్మ ఒప్పుకున్నాడని టాక్. నాగ్ అశ్విన్ మొదటగా ఆ పాత్రకి తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ ని అనుకున్నా.. ప్రభాస్ కలుగచేసుకుని ఆర్జీవీని పెట్టించాడట. ఏదేమైనా ప్రభాస్ తో సాన్నిహిత్యం నేపథ్యంలో మొదటిసారి వర్మ బయటి దర్శకుడి సినిమాలో కనిపించబోతున్నారు.