అమ్మరాజ్యంలో కడప బిడ్డలు.. కరాకరె పేరు మార్పుకు వర్మ సై..  - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మరాజ్యంలో కడప బిడ్డలు.. కరాకరె పేరు మార్పుకు వర్మ సై.. 

November 27, 2019

Ram Gopal Varma Green signal for the movie name change 

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముట్టుకుంటుండంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ పేరు మార్పుకు సిద్ధపడ్డాడు. తాజాగా వర్మ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ సినిమా పేరును ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మారుస్తున్నట్టు ప్రకటించాడు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఈ సినిమాలో వర్మ తమను అవమానిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పైగా రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా టైటిల్ ఉందని ఆ సామాజిక వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో వర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. 

ఈ టైటిల్ మార్పుతోనే వర్మ రేపు సెన్సార్ బోర్డుకు వెళ్తున్నాడు. మరోవైపు చంద్రబాబు, లోకేష్‌లను కించపరుస్తూ ఈ సినిమా తీశారని టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే సినిమాకు ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. బయట చూస్తేనేమో సినిమా మీద బోలెడన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. మరి ఈ వివాదాలను దాటుకుని సెన్సార్ ఆమోదం పొంది సినిమా అనుకున్న తేదీకి విడుదల అవుతుందా? వాయిదా పడుతుందా అనేది వేచి చూడాల్సిందే.