ram gopal varma meets chikoti praveen and biopic rumors are cooking in tollywood
mictv telugu

కాసినో చీకోటి బయోపిక్.. ఆర్జీవీ ‘జగన్నాటకం’లో భాగమేన!

November 2, 2022

వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వర్మ. అనూహ్యమైన సినిమాలు, కాంట్రవర్సీ వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీల బయోపిక్‌లు, ఫ్రీహ్యాండ్ చిత్రాలను రూపొందించిన వర్మ తాజా చర్యలు మరో బయోపిక్‌ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సూచిస్తున్నాయి. ఇటీవల కాసినో వ్యాపారంలో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ED, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులతో వార్తల్లో నిలిచిన చీకోటి ప్రవీణ్‌తో వర్మ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ‘వైల్డ్ మెన్ చికోటి ఫామ్ హౌస్‌లోని విదేశీ జంతువుల సేకరణను నన్ను ఆకట్టుకుంది. అయితే చీకోటి ప్రవీణ్‌తో కలిసి పలు విషయాలపై చర్చించా’ అంటూ చికోటితో దిగిన పిక్స్‌ను ఆర్జీవీ స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఇది కేవలం క్యాజువల్ మీట్ అంటూ కలరింగ్ ఇస్తున్న వర్మ.. చీకోటిపై బయోపిక్ సినిమా తీయనున్నట్టు లీక్స్ వస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన చికోటి ఉదంతంపై వర్మ సినిమా తీయనున్నాడని అంటున్నారు. ఇందులో భాగంగానే ఆర్జీవీ ఆయనను కలిసి చర్చించినట్లు వినికిడి. అయితే ఇప్పటికే వర్మ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన ఆర్జీవీ.. వైసీపీకి అనుకూలంగా మూడు సినిమాలను చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు ‘జగన్నాథ రథ చక్రాలు’ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైల్డ్ మెన్ చీకోటితో సపరేట్ మూవీ ఉంటుందా లేక జగన్నాథ రథచక్రాల్లో భాగంగానే వర్మ చికోటిని కలిశాడా అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే చికోటి ప్రవీణ్ కేసులో ఏపీ పొలిటీషియన్స్ పేర్లు కూడా పెద్దగా వినిపించాయి. కొందరు మంత్రులకు సైతం చీకోటితో సంబంధాలు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా చికోటితో ఆర్జీవీ కలయిక అటు రాజకీయాల్లో, ఇటు పరిశ్రమలో చర్చనీయాంశ అవుతుంది.