ram gopal varma meets chikoti praveen and biopic rumors are cooking in tollywood
mictv telugu

తీవ్ర విషాదం.. ఆసుపత్రి బెడ్‌పై పాట పాడుతూ.. ప్రముఖ సింగర్ కన్నుమూత

November 2, 2022

ప్రఖ్యాత మణిపురి గాయకుడు సురేన్ యుమ్నం అక్టోబర్ 31న సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. అతని వయస్సు 35. కొన్ని నెలల క్రితం ఈ గాయకుడు కాలేయ వ్యాధి కారణంగా RIMS ఆసుపత్రిలో చేరారు. అయితే అతని అనారోగ్యం మరింత దిగజారడంతో ఢిల్లీలోని ILBS ఆసుపత్రిలో చికిత్స తీసుకుని మెరుగయ్యారు. అయితే, గత 10 రోజుల నుండి దివంగత గాయకుడు మరోసారి అనారోగ్య భారిన పడ్డాడు. దాంతో అనుకోకుండా మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే మణిపూర్ ప్రజలు భారీ విరాళాలు ఇచ్చి మరి ఢిల్లీలోని RIMS ఆసుపత్రిలో సురేన్ కి వైద్య చికిత్సకి సహాయం చేశారు. అయినా ప్రాణాలు దక్కపోవటంతో మణిపూర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Kailash Kher (@kailashkher)

ఇక తాజాగా ఆసుపత్రి బెడ్ పై పాట పాడుతూ సురేన్ యుమ్నం మరణించాడని వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఈ వీడియో చూసిన సురేన్ ఫ్యాన్స్ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. బాలీవుడ్ సెలబ్రెటీస్, నెటిజన్స్ అందరు సురేన్ యుమ్నంకి సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్ సింగర్ కైలాష్ ఖేర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రోజు ఒక వీడియోను పోస్ట్ చేసారు. దీనిలో ప్రఖ్యాత మణిపురి గాయకుడు సురేన్ తన మరణ శయ్యపై ‘అల్లా కే బందే’ అనే పాటని పాడుతూ బాధ పడటాన్ని చూడవచ్చు. ఈ విషయాన్నీ కైలాష్ స్వయంగా రాసి పోస్ట్ చేయటంతో.. ఆ వీడియోని చూసిన ఫాన్స్, నెటిజన్స్ కన్నీటిపర్యంతం అవుతున్నారు.