పోర్న్ స్టార్ తో వర్మ మరో సినిమా..రేపే టీజర్ - MicTv.in - Telugu News
mictv telugu

పోర్న్ స్టార్ తో వర్మ మరో సినిమా..రేపే టీజర్

May 13, 2020

cc cvn

జనవరి 27, 2018న విడుదలైన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ అనే షార్ట్ ఫిల్మ్ ఎంత వివాదాస్పదమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ మియా మల్కోవా నటించిన ఈ షార్ట్ ఫిల్మ్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ షార్ట్ ఫిల్మ్ లో వర్మ మహిళల అందం, లైంగికత గురించి చర్చించారు. ఈ షార్ట్ ఫిల్మ్ కి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించడం గమనార్హం.

తాజాగా ఇదే నటితో వర్మ మరో సినిమా తీశారు. ‘క్లైమాక్స్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను రేపు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తునట్టు వర్మ ట్విట్టర్ లో ప్రకటించాడు. ఈ సినిమాను ఆర్ ఎస్ ఆర్ ప్రొడక్షన్స్ అండ్ శ్రేయాస్ ఈటీ సంయుక్తంగా నిర్మించాయని తెలిపారు.