‘జార్జిరెడ్డి’ హీరోతో వర్మ మరో సినిమా.. స్టోరీ చెప్పేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

‘జార్జిరెడ్డి’ హీరోతో వర్మ మరో సినిమా.. స్టోరీ చెప్పేశాడు

November 19, 2019

సంచలనాలకు కేంద్ర బిందువైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలను పట్టాలు ఎక్కిస్తున్నాడు. ఇప్పటికే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెల్సిందే. ఈలోపు మరో సినిమాను ప్రకటించాడు. 

జార్జిరెడ్డి సినిమాలో హీరోగా నటిస్తోన్న సందీప్ మాధవ్ హీరోగా ఓ సంచలన చిత్రం చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టుల మీద సినిమాలు తీసిన నేను..హైదరాబాద్ దాదాలపై ఓ సినిమా చేస్తున్నాని వర్మ తన ట్విట్టర్‌లో తెలిపాడు. హైదరాబాద్‌లో 1980లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమా ఉంటుందని ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమాలో నటించడానికి సందీప్ మాధవ్ సంతకం కూడా చేశాడని వర్మ పేర్కోన్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వంగవీటి’ సినిమా వచ్చిన సంగతి తెల్సిందే. సందీప్ మాధవ్ తాజాగా నటించిన జార్జిరెడ్డి సినిమా ఈ నెల 22 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.