ఆర్జీవీకి ‘పవర్ స్టార్’ నరేష్ ఝలక్..ఫ్యాన్స్ బెదిరింపులు! - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్జీవీకి ‘పవర్ స్టార్’ నరేష్ ఝలక్..ఫ్యాన్స్ బెదిరింపులు!

July 7, 2020

varma

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ పేరుతో ఓ సినిమాను రూపొందిస్తునట్టు ప్రకటించిన సంగతి తెల్సిందే. ఆ సినిమాలో హీరోగా నటిస్తున్న వ్యక్తి వీడియోను వార్త తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఆ వ్యక్తి నటుడు పవన్ కళ్యాణ్‌ను పోలి ఉండడం గమనార్హం. అతని పేరు నరేష్ అని తేలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామానికి చెందిన వాడు. తరుచూ టిక్‌టాక్ వీడియోలు చేస్తూ.. జూనియర్ పవర్ స్టార్‌గా తెలుగు నెటిజన్లకు సుపరిచితుడే.

తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ సినిమా నుంచి నరేష్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి వచ్చిన బెదిరింపులతో నరేష్ తప్పుకున్నాడని సమాచారం. దీంతో వర్మ ఈ సినిమాను పక్కన పెట్టినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికిప్పుడు పవన్ లా కనిపించే మరో వ్యక్తిని తీసుకుని రావడం చాలా కష్టమని వర్మ భావిస్తున్నారట. ఈ విషయమై వర్మ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిఉంది.