‘ది కశ్మీర్ ఫైల్స్’ బాలీవుడ్‌ని తొక్కేసింది : ఆర్జీవీ - MicTv.in - Telugu News
mictv telugu

‘ది కశ్మీర్ ఫైల్స్’ బాలీవుడ్‌ని తొక్కేసింది : ఆర్జీవీ

March 15, 2022

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తాజాగా విడుదలైన సినిమా ది కశ్మీర్ ఫైల్స్. 1990లో కాశ్మీర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రధాని మోదీ ఈ చిత్రాన్ని చూసి యూనిట్‌ను ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ‘ దర్శకుడు వివేక్ ఒక ఫైర్‌తో ఈ సినిమాను తీశారు.

 

దీంతో బాలీవుడ్‌ని తొక్కేసి కొత్తగా వివేక్ వుడ్‌ని స్థాపించినట్టే. కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకునేవారికి స్పూర్తిగా ఈ చిత్రం ఉంది. ఈ విషయంలో ఈ చిత్రం చాలా గొప్ప విజయం సాధించింద’ని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా, కలెక్షన్లలో దూసుకుపోతున్న ఈ సినిమా త్వరలో వంద కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.